నాకు నయనతారను కలవాలని ఉంది.. తమిళనాడు ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

Divya
ఏప్రిల్ 23వ తేదీన తమిళనాడు ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. దీంతో ఇప్పటికే అన్ని పార్టీలు కూడా అక్కడ ప్రచారం మొదలుపెట్టాయి. అలాగే మేనిఫెస్టో విషయంలో కూడా ఏ పార్టీకి ఆ పార్టీ ప్రకటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళల భద్రత గౌరవం కోసం ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే మంగళవారం రోజున చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ ఒకరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాలలో సంచలనంగా మారుతున్నాయి.


ముఖ్యంగా ప్రముఖ హీరోయిన్ నయనతారను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు విమర్శల పాలయ్యేలా చేస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవల ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ప్రజలు తమ కలలను పంచుకోవాలని వాటిని నెరవేర్చుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ విషయం పైన విమర్శించే క్రమంలో అన్నాడీఎంకే పార్టీ ఎంపీ షణ్ముగం మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం కలలు కనమన్నారు.. సీఎం స్టాలిన్ కూడా మన కలలను వారితో పంచుకోమంటున్నారు. నాకు నయనతారను కలవాలని ఉంది! నా కోరికను సీఎం తీరుస్తారా అంటూ ప్రశ్నించారు?


అలాగే తమకు నయనతారత వివాహం చేయమని ఎవరైనా అడిగితే ఆ కలను ఆయన నెరవేరుస్తారా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. డీఎంకే హయాంలో పాలన గాడి తప్పిందని మహిళలపై ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయి శాంతిభద్రతలు క్షీణించాయంటూ అన్నాడిఎంకె పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. అలా ఎంపీ తన సొంత నియోజకవర్గమైన విల్లుపురం జిల్లాలో ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళల భద్రత కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో ఒక హీరోయిన్ కించపరచడంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ ఎంపీ మాట్లాడిన వ్యాఖ్యలకు పక్కన ఉన్న ఇతర పార్టీ నాయకులు కూడా నవ్వుతూ మద్దతు తెలపడం పై కూడా చాలామంది నెట్టిజెన్స్, అభిమానులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదంపై నయనతార ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: