భారీ ధరకు దృశ్యం 3 రైట్స్ సొంతం చేసుకున్న ఓటీటి సంస్థ..!
అన్ని డిజిటల్ ఫార్మాట్లో ఎక్స్క్లూజివ్ రైట్స్ తమకే ఉన్నాయంటూ అమెజాన్ ప్రైమ్ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. ఈ ఫ్రాంచైజీకి ఉన్న విపరీతమైన క్రేజీని క్యాష్ చేస్తోంది అమెజాన్. ఇప్పటికీ దృశ్యం 1, దృశ్యం 2 అమెజాన్ ప్రైమ్ లోనే అందుబాటులో ఉన్నాయి. వీటికి ఇప్పటికి మిలియన్స్ కొద్ది వ్యూస్ రావడంతో మూడో భాగాన్ని కూడా తమ ఫ్లాట్ ఫామ్ లోనే ఉంచేలా అమెజాన్ ప్రైమ్ మేకర్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.మలయాళంతో పాటు తెలుగు తమిళ్ కన్నడ వంటి భాషలలో ఒకేసారి విడుదల కాబోతోంది.
అయితే థియేటర్ రన్ టైం పూర్తి చేసుకున్న తర్వాతే దృశ్యం 3 ఓటీటి లోకి రాబోతోంది. థియేటర్లో విడుదలైన 30 రోజుల తర్వాతే ఈ సినిమా ఓటీటి లో వచ్చే అవకాశం ఉన్నది. డైరెక్టర్ జీతూ జోసెఫ్ , మోహన్లాల్ తన యాక్టింగ్, మీనా తదితరు నటి నటులు ఇందులో అద్భుతంగా నటించారు. మరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి ముగింపు ఉంటుందా లేదా అనే విషయం తెలియాలి అంటే థియేటర్లో చూడాల్సిందే. అయితే మొదటి రెండు భాగాలు హీరో వెంకటేష్ తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశారు.కానీ మూడవ భాగాన్ని డైరెక్ట్ గా తెలుగులో విడుదల చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మే 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది.