ది రాజాసాబ్ మూవీ రివ్యూ & రేటింగ్!

Reddy P Rajasekhar

ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కిన ది రాజాసాబ్ మూవీ థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. దాదాపుగా 550 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకునే విషయంలో ఫెయిలయ్యింది. హర్రర్ ఫాంటసీ మూవీగా తెరకెక్కిన ది  రాజాసాబ్  సినిమాపై దర్శకుడు మారుతి కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేశారు. అయితే సినిమాలో సీన్ల మధ్య కనెక్టివిటీ లేకపోవడం బిగ్గెస్ట్ మైనస్ అయింది.

కథ :

సాధారణ వృద్దురాలిగా జీవితం గడుపుతున్న గంగాదేవి అలియాస్ గంగమ్మ (జరీనా వాహెబ్) మనవడు రాజాసాబ్(ప్రభాస్).  తనను వదిలి వెళ్లిపోయిన  భర్త కనకరాజు (సంజయ్ దత్)  దగ్గరకు ఎప్పటికైనా చేరుకోవాలని గంగమ్మ భావిస్తుంది.  దేవనగర సంస్థానానికి ఒకప్పుడు జమిందార్ అయిన గంగాదేవి అంటే మనవడికి పంచప్రాణాలు.  తాత ఫోటో చూడటం తప్ప రాజాసాబ్ కు  తాత గురించి పెద్దగా తెలియదు.

కలలో తనకు కనిపించే తాతని ఎలాగైనా తీసుకొనిరావాలని  గంగాదేవి మనవడిని కోరుతుంది.  అయితే కనకరాజు తనకు తెలిసిన విద్యలతో గంగాదేవిని, రాజాసాబ్ ను నర్సాపూర్ లోని మహల్ కు వచ్చేలా చేస్తాడు. మార్మిక విద్యలు తెలిసిన కనకరాజు తన భార్య, మనవడిని ఎందుకు చంపాలనుకుంటాడు?  ఆ సమస్యలను రాజాసాబ్ ఎలా పరిష్కరిస్తాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

విశ్లేషణ :

ప్రభాస్ లార్జర్ దన్ లైఫ్ సినిమాలు చేయడం కొత్త కాదు.  ప్రభాస్ హీరోగా హారర్ ఫాంటసీ మూవీ అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏడ్పడతాయి. మారుతి బ్రహ్మాండమైన స్టోరీ లైన్ ను ఎంచుకున్నా ఈతరం ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను తెరకెక్కించే విషయంలో ఫెయిల్ అయ్యాడు.  అయితే ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ను చూసిన  అనుభూతి కలుగుతుంది.  ఫస్టాఫ్ ప్రేక్షకులను మెప్పించేలా లేకపోవడం  సినిమాకు మైనస్ అయింది.

సినిమాలో కామెడీ సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నా అవి పూర్తిస్థాయిలో ప్రేక్షకులను మెప్పించవు. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సన్నివేశాలు  బాగానే ఉన్నా మెజారిటీ సన్నివేశాలు ప్రేక్షకులకు నచ్చేలా లేకపోవడంతో ఈ సినిమాతో డిస్ కనెక్ట్ అవుతాం. ది రాజాసాబ్ సినిమాకు  సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చినా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కడం కష్టమేననే  కామెంట్లు వ్యక్తమవుతూ  ఉండటం కొసమెరుపు.

సినిమాకు ప్రభాస్ హైలెట్ అయ్యారు.  తన యాక్టింగ్ తో సీన్ రేంజ్ ను పెంచే విషయంలో ప్రభాస్ సక్సెస్ అయ్యారు.  మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ ప్రత్యేకతను చాటుకున్నారు. కనకరాజు పాత్రలో సంజయ్ దత్  నటన బాగుంది. నాన్నమ్మ పాత్ర పోషించిన జరీనా  వాహెబ్ తన నటనతో ప్రత్యేకతను చాటుకున్నారు. బోమన్ ఇరానీ, సముద్రఖని పాత్రలకు అనుగుణంగా నటించారు.

థమన్ పాటలు ఆకట్టుకోలేకపోయినా బీజీఎమ్ విషయంలో మెప్పించారు.  కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ బాగుంది.  నిర్మాణ విలువలు గ్రాండ్ గా  ఉన్నాయి. మారుతి ప్రభాస్ ను అభిమానులకు నచ్చేలా చూపించడంలో ఫెయిల్ అయ్యారు. ఎడిటింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది.

బలాలు :  ప్రభాస్ నటన,  ఇంటర్వెల్, క్లైమాక్స్, స్టోరీ లైన్

బలహీనతలు : కథనం, దర్శకత్వం, మ్యూజిక్

రేటింగ్ : 2.5/5.0  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: