ఆ షెడ్యూల్ తో "గేమ్ చేంజర్" షూటింగ్ పూర్తి..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉండగా ... ఎస్ జె సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

కియార అద్వానీ ఈ సినిమాలో చరణ్ కు జోడి గా కనిపించనుండగా ... అంజలి , శ్రీకాంత్ , సునీల్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో ఈ మూవీ కి సంబంధించిన కొత్త షెడ్యూల్ రాజమండ్రి లో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రాజమండ్రి లో ఈ మూవీ బృందం తెరకెక్కించనున్న షెడ్యూల్ తో ఈ సినిమాకు సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఈ మూవీ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా స్టార్ట్ చేసి చాలా స్పీడ్ గా ఆ పనులను కూడా పూర్తి చేసి అక్టోబర్ నెలలో ఈ మూవీ ని విడుదల చేయాలి అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనే ఈ సినిమా నిర్మాత అయినటువంటి దిల్ రాజు ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలియజేశాడు. చరణ్ , శంకర్ కాంబో లో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రస్తుతానికి ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: