చైనాకి ధారుణమైన ఎదురుదెబ్బ ఆసియా పసిపిక్ కు భారత్ నాయకత్వంలో చతుర్భుజ కూటమి

కమ్యూనిష్ట్ దేశమైనా సామ్రాజ్యవాదంతో ముందుకెళుతున్న చైనా ఇరుగు పొరుగు దేశాలపై తన అధిపత్యాన్ని ప్రదర్శించటం
ప్రారంభించి దశాబ్ధాలైంది. అలా డ్రాగన్ చైనా మింగేసిన దేశమే టిబెట్. అలాగే "సలాం స్లైసింగ్ పద్దతిలో అంటే కామెల్ & అరబ్ కథ" లో లాగా భూబాగాలను ఆక్రమిస్తూ తన దొంగ దురాక్రమణ కొనసాగిస్తూనే ఉంది. 



ఈ విధంగా ఒక ప్రక్క ప్రక్క దేశాల భూభాగ దురాక్రమణ కొనసాగిస్తూనే అవసరాన్ని అవకాశంగా తీసుకొని - ఋణాలు అవసర మైన దేశాలకు భారీ వడ్డీ రేట్లు చార్జ్ చెస్తూ, తమ తయారీ ఉత్పత్తులను ఆయా దేశాల్లో విస్తృతంగా మార్కెట్ చేస్తూ అక్కడి పరిశ్రమలను నిర్వీర్యం చేస్తూ తన కభంద హస్తాల్లోకి ఆయాదేశాల ఆర్ధిక దిగ్భందనం మరొప్రక్క చేస్తూ పరొక్షం గా కొన్ని దేశా లను తన ఆదీనం లోకి తెచ్చుకుంటుంది. అలాంటి వాటికి పాకిస్తాన్, మాలే, శ్రీలంక, నేపాల్ లాంటి దేశాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.


ఇలా ఇతర దేశాలు మైకం వదిలి ఎదురుతిరిగితే తన సైన్యం ఆయుధాలతో వాటిని భయపెడుతూ వస్తుంది డ్రాగన్. అయితే గత 2014 సంవత్సారం నుండి భారత్ చైనా విషయంలో తన వ్యూహం మార్చింది. చైనా రాక్షసానికి భారత్ తన చాణక్యాన్ని కొన్ని చోట్ల కౌటిల్యాన్ని ప్రదర్శిస్తూ అంతర్జాతీయన్ గా చైనా విధానాన్ని ఎండగట్టి అన్నీ దేశాల సహాకారం తీసుకుంటూ చైనాని దాదాపుగా నిలువరించిందనే చెప్పవచ్చు.


ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో  ఎదురులేని ఆర్థిక, సైనిక శక్తిగా అవతరించిన చైనా ఆధిపత్య ధోరణిని కట్టడి చేయడానికి పదేళ్ల నాటి ప్రతిపాదన కార్యరూపం దాల్చడానికి రంగం సిద్ధమైంది. దక్షిణ చైనా సముద్రంపై పూర్తి పెత్తనం కోరుతున్న చైనా ఆట లు సాగకుండా "అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా" నాలుగు తో కూడిన నాలుగు దేశాల కూటమి(క్వాడ్రిలేటరల్‌ క్వాడ్) అవసరమని జపాన్‌ ప్రధాని షింజో అబే 2007 లో సూచించారు. తర్వాత నెల రోజులకే  ఆయన పదవి నుంచి వైదొలిగాక ఈ చైనా నిరోధక వ్యూహమైన "చతుర్భజం" అనే వ్యూహం మరుగున పడిపోయింది.


మళ్లీ ఇన్నాళ్లకు షింజో అబే జపాన్‌ ప్రధానిగా తన స్థానం బలోపేతం చేసుకున్నాక ఈ ప్రతిపాదనకు గట్టి ఆమోద ముద్ర లభించింది. ఇటీవల 31వ ఆగ్నేయాసియా, 12వ తూర్పుఆసియా సదస్సులో పాల్గొనడానికి ఈ నాలుగు దేశాల నేతలు పిలిప్పీన్స్ రాజధాని మనీలా వచ్చిన సందర్భంగా నాలుగు రాజ్యాల కూటమి ప్రతిపాదనపై ఉన్నతాధి కారుల స్థాయిలో చర్చలు జరిగాయి. షింజో మొదటిసారి ఈ ఆలోచనను 2007 ఆగష్టు లో భారత పార్లమెంటులో ప్రసంగిస్తూ వెల్లడించారు. "ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఇండియా, జపాన్‌ కలిసి పనిచేస్తే ఈ విశాల ఆసియా ప్రాంతం పసిఫిక్ మహా సముద్ర ప్రాంతాల న్నిటినీ కలుపుకుని ఇక్కడి దేశాల మధ్య సంబంధాలను బలోపేతంచేసే శక్తిగా అవరిస్తుంది. ఈ క్రమంలో వీటికి అమెరికా, ఆస్ట్రేలియా జత కూడితే ఇక్కడ ప్రజలు, సరకులు, పెట్టుబడులు, పరిజ్ఞానం స్వేచ్ఛగా ఒక చోట నుంచి మరో చోటకు పయ నించడానికి వీలవు తుంది" అని షింజో అబే వివరించారు.



అంతర్జాతీయ ఆర్థిక ప్రపంచంలో ప్రధాన పాత్ర పోషించే ఆసియా, పసిఫిక్‌ దేశాల రవాణాకు "దక్షిణ చైనా సముద్రం" ఎంతో కీలకమైంది. అయితే, ప్రపంచీకరణ ఫలాలతో బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనా ఈ సముద్ర ప్రాంతంపై పూర్తి ఆధిపత్యం సాధించే విధంగా చర్యలు తీసుకుంటోంది. పొరుగు దేశాలను బెదరించే ధోరణిలో ప్రకటనలు చేస్తోంది. అదీగాక, చైనాతో ప్రాదేశిక వివాదాలతో సతమతమైన జపాన్ ఈ నియంతృత్వ కమ్యూనిస్టు రాజ్యం అనుసరించే పెత్తం దారీ ధోరణులకు వ్యతి రేకంగా సంకీర్ణం నిర్మించాలనే పట్టుదలతో ఉంది. 


ఇటీవల డొనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వంలోని అమెరికా  అగ్రరాజ్య ఆధిపత్య హోదా నెమ్మదిగా బలహీనం కావడంతో నాలుగు దేశాల ప్రాంతీయ కూటమి అత్యవసరమనే అభిప్రాయానికి జపాన్ వచ్చినట్టు కనిపిస్తోంది. దక్షిణాసియా, ఆగ్నేయాసియా తాజా పరిణామాల ఫలితంగా చైనాకు ఇండియా మరింత దూరం కావడంతో భారత్ ను ఈ కూటమిలో చేర్చుకోవడానికి ఇదే మంచి తరుణమని కూడా షింజే అబే భావిస్తున్నారు. అధ్యక్షపదవి చేపట్టినప్పటి నుంచీ చైనాను కట్టడి చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అమెరికా ఈ కూటమి ప్రతిపాదనపై ఆసక్తి ప్రదర్శిస్తోంది. అమెరికాను అనుసరించే ఆస్ట్రేలియా కూడా ఇప్పుడు "చతుర్భుజ వ్యూహం" లో భాగస్వామి కావడానికి సిద్ధమైంది. పదేళ్ల క్రితం ఈ ప్రతిపాదన వెల్లడి కాగానే చైనా చేసిన బెదిరింపులు, అప్పటి ఆర్థిక సమస్యల కారణంగా జపాన్ తప్ప మిగిలిన మూడు దేశాలూ వెనక్కి తగ్గాయి. 


హిందూమహాసముద్ర ప్రాంతం, ఆగ్నేయాసియా ప్రాంతం మీదుగా ముడి చమురు చైనాకు రవాణా అవుతోంది. అందుకే ఈ ప్రాంతాలపై తన ప్రభావం, ఆధిపత్యం ఉండేలా చైనా చాలా కాలంగా పావులు కదుపుతూ తాననుకున్న దాంట్లో సింహభాగం సాధించింది. ఆనాడు ముఖ్యంగా 2014కు ముందు దౌత్య, ప్రాంతీయ సంబంధాల్లో ఇండియా కొంత వెనుకబడడం చైనాకు ఇప్పటి వరకూ కలిసొచ్చింది. మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంకతో చైనాకు సంబంధాలు బాగా బలపడ్డాయి. రెండు నెలలకు పైగా డోక్లాం వివాదంతో విసిగిపోయిన భారత్‌కు ఈ "చతుర్భుజ కూటమి" లో చేరడం మంచి అవకాశంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ చైనా ప్రవర్తన గమనిస్తే అంతర్జాతీయ చట్టాలపై దానికి గౌరవం లేదనే అభిప్రాయం కలుగుతుంది. 


అందుకే గత ఆదివారం మనీలా లో జరిగిన అధికారుల స్థాయి సమావేశంలో, ఇండో పసిఫిక్‌ ప్రాంతం లో అందరూ నియమ నిబంధనలతో కూడిన పద్ధతి అనుసరించడం, అంతర్జాతీయ చట్టాలను గౌరవించే క్రమంలో అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛ గా నౌకా రవాణాకు, గగనతలంలో విమానాలకు అడ్డంకులు లేకుండా చూడడం, ఇక్కడ నౌకలకు భద్రత కల్పిస్తూ ఉగ్రవాదుల నుంచి సవాళ్లను దీటుగా ఎదుర్కోవడం వంటి అంశాలపై నాలుగు దేశాల ప్రతినిధులు చర్చించారు.


వ్యూహాత్మక "చతుర్భుజ కూటమి" ఏర్పాటు, అదే సమయంలో "ఇండో-పసిఫిక్‌" అనే పదాన్ని అమెరికాస్ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉపయోగించిన భారత్ ప్రమేయాన్ని ప్రమాణంగా చేస్తూ సంభాషించటం తో అంతర్జాతీయంగా ఈ విషయం పెనుప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన కీలక వ్యాఖ్యల నేపథ్యంలో పలు దేశాలు భారత్‌ వైపు చూస్తున్నాయి. ఇప్పటికే "భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, అమెరికా" లు చైనాకు ధీటుగా "చతుర్భుజ కూటమి" ని ఏర్పాటుచేసే పనిలో ముందుకు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 


తాజాగా భారత్‌తో బంధాలను మరింత ధృఢపరచుకునే దిశగా ఫ్రాన్స్‌ అడుగులు వేస్తోంది. అదే సమయంలో "హిందూ మహాసముద్ర ప్రాతం" (ఇండియన్‌ ఓషన్‌ రీజియన్‌ - ఐఓఆర్‌) లో భాగంగా భారత్‌ తో ఉన్నత స్థాయి చర్చలకు ఫ్రాన్స్‌ సిద్ధమవుతోంది. మనీలాలో జరిగిన ఇండియా- ఏసియన్‌ సదస్సులో చతుర్భుజ కూటమి చర్చల అనంతరం భారత్‌ బంధంపై ఫ్రాన్స్‌ మరింత ఆసక్తి చూపుతోంది. ఇదే విషయాన్ని భారత్‌లో ఫ్రాన్స్‌ రాయబారి అలెగ్జాండర్‌ జిగేల్మర్‌ వివరించారు.


"హిందూ మహాసముద్ర ప్రాంతం" లో చైనా ఆధిపత్యాన్ని నిలువరించాలంటే, భారత్‌ తో బంధాన్ని మరింత ధృఢం చేసు కోవాల్సిన అవసరముందని ఆయన గుర్తించారు. భారత్‌ తో వ్యూహాత్మక భాగస్వామ్యం, రక్షణ, అంతరిక్షరంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం మరింత బలపడాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగానే శుక్రవారం ఫ్రాన్స్‌ విదేశాంగ శాఖ మంత్రి జేన్‌ యువాస్‌ డ్రెన్‌, 2018 ఆరంభంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యువల్‌ మాక్రాన్‌ భారత్‌లో పర్యటిస్తారని ఆయన తెలిపారు. భారత్‌ తో ద్వైపాక్షిక సంబంధాలను అభివృద్ధి చేసుకునేందుకు ఫ్రాన్స్‌ అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోందని ఆయన అన్నారు. హిందూమహాసముద్రం లో నౌకా స్థావరాల ఏర్పాటు, ద్వీపాల రక్షణ, ఇతర అంశాల్లో భారత్‌ సహకారం తమకు అవసరమని ఫ్రాన్స్‌ పేర్కొంది.


ఈ విధంగా చైనా ఆధిపత్యాన్ని నిరోధించే క్రమంలో నాలుగు దేశాల కూటమికి మరోదేశం ఫ్రాన్స్ కూడా జతకడుతుండటం లో డ్రాగన్ చైనా తన కుయుక్తులకు మరోసారి పదును పెడుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: