కేశినేని నాని, బోండా ఉమలను బాబు ఏమని తిట్టారో తెలుసా..!

Chakravarthi Kalyan
విజయవాడ ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయం వద్ద మొన్న లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు ధర్నా చేశారు. ఉత్తరాది రాష్ట్రాలకు నాలుగు వందల ప్రయివేటు బస్సులు తిరుగుతున్నాయని... అనధికారికంగా అనుమతి లేకుండా బస్సులు తిప్పుతున్నా.. రవాణా అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. 


ఏకంగా ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపైనే గూండాగిరీ చేశారు.. ఇది మీడియాలో హైలెట్ కావడంతో పార్టీకి చెడ్డపేరు వస్తుందని చంద్రబాబు భయపడిపోయారు. ఓవైపు మొన్నటికి మొన్న జగన్ వైద్యులు, పోలీస్ అధికారులపై మండిపడితే తప్పుబట్టిన తామే ఇలా ప్రవర్తిస్తే భంగపాటు ఖాయమని ఫీలయ్యారు. అర్జంటుగా బెజవాడ టీడీపీ నేతలను పిలిపించుకుని తలంటారు.


ఎంపీ కేశినేని నాని , ఎమ్మెల్యే బొండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను ఇంటికి పిలిపించుకొని, వారు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. వెంటనే రవాణశాఖ కమిషనర్‌ను కలిసి క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. ‘అధికారంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జగన్‌ అధికారులపై విరుచుకు పడుతున్నాడని మనం తిడుతున్నాం. నిన్న మీరు చేసిందేంటి? ఐపీఎస్‌ అధికారి గన్‌మెన్‌ను తోసేస్తారా.. మీకు జగన్‌కు తేడా ఏంటి? ప్రజలకు ఏం చెబుదాం అనుకుంటున్నారు. మీరు చేసిన పనితో పార్టీకి ఎంత చెడ్డపేరు వచ్చిందో మీకు అర్థమవుతుందా’ అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.


అధికారులతో మీకేదైనా ఇబ్బంది ఉంటే నా దృష్టికి తీసుకు రావాలే తప్ప, నేరుగా మీరు అధికారులతో గొడవకు దిగితే ఎలా... మీరు చేసిన పని ప్రతిపక్ష నేతలకు మనల్ని తప్పుబట్టే అవకాశాన్ని ఇచ్చింది. అధికారంలో ఉన్నవారు అరిటాకుల్లాంటి వారు.. తప్పు ఎవరిదైనా అధికారంలో ఉన్న వారు కాస్త తగ్గి ఉండాలి.. అంటూ చంద్రబాబు క్లాస్ పీకారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: