"టిల్లు క్యూబ్" లో హీరోయిన్ గా ఆ క్రేజీ బ్యూటీ..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటలలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. సిద్దు 2022 లో విడుదల అయిన డీజె టిల్లు మూవీ తో మొట్ట మొదటి బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ మూవీ లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ తో ఓవర్ నైట్ లో సిద్దుక్కు సూపర్ క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో లభించింది.

ఈ మూవీ మంచి విజయం సాధించడంతో దీనికి కొనసాగింపుగా టిల్లు స్క్వేర్ అనే మూవీ ని తెరకెక్కించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా ... మల్లిక్ రామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తాజాగా మార్చి 29 వ తేదీన విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఏకంగా ఈ సినిమా 120 కోట్లకు పైగా కలెక్షన్ లను వసూలు చేసి సిద్దు కెరియర్ లో మరి బ్లాక్ బాస్టర్ మూవీ గా నిలిచింది. దానితో ఈ మూవీ కి కొనసాగింపుగా టిల్లు క్యూబ్ అనే మూవీ ని తెరకెక్కించబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

దానితో ఇందులో హీరోయిన్ గా ఎవరు చేస్తారు అనే ప్రశ్న జనాల్లో రేకెత్తుతోంది. ఇకపోతే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన ముద్దుగుమ్మలలో ఒకరు అయినటువంటి ప్రియాంక జవాల్కర్ "టిల్లు క్యూబ్" లో సిద్దు కి జోడిగా నటించబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. మరి నిజంగానే ప్రియాంక కు ఈ మూవీ లో అవకాశం వస్తే ఈ బ్యూటీ అదిరిపోయే క్రేజీ సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్నట్లే అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

pj

సంబంధిత వార్తలు: