రోహిత్ గురుంచి.. ఆ ఆందోళన అక్కర్లేదు : గంగూలీ

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ టోర్నీ మరికొన్ని రోజుల్లో జరగబోతుంది అన్న విషయం తెలిసిందే.  అయితే ఈ ప్రపంచకప్ టోర్నికి ఈసారి అటు వెస్టిండీస్ యూఎస్ లు ఆతిథ్యం ఇస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇప్పటికే వరల్డ్ కప్ లో పాల్గొనబోయే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఇక ఐసిసి టోర్నీ ఆడబోయే జట్టు సభ్యుల వివరాలను ప్రకటించాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ కూడా ఇటీవల వరల్డ్ కప్ కోసం టీం ఇండియాను ప్రకటించింది అన్న విషయం తెలిసిందే.

 రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగేందుకు రెడీ అవుతుంది టీమిండియా. అయితే వరల్డ్ కప్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కొన్ని విషయాలు మాత్రం భారత అభిమానులు అందరిని కూడా ఆందోళన కలిగిస్తూ ఉండడం గమనార్హం. మరి ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతూ ఉండడం అందరిని భయపెడుతుంది. ఇప్పటికే గత కొన్నేళ్ల నుంచి టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ టైటిల్ గెలవడం అనేది అందరి ద్రాక్ష లాగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.

 గత ఏడాది దాదాపు కప్పు కొట్టినట్లే అందరిని నమ్మించేసిన టీమ్ ఇండియా ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయి నిరాశ పరిచింది. అయితే ఇక ఇప్పుడు టి20 వరల్డ్ కప్ లో తప్పక విజయం సాధించాలి అనే పట్టుదలతో ఉంది. ఇలాంటి సమయంలో రోహిత్ శర్మ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతూ ఉండడం ఆందోళనకు దారి తీస్తోంది. అయితే ఐపీఎల్ లో రోహిత్ శర్మ పేలవమైన  ప్రదర్శనతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్న వేళ.. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరబ్ గంగూలీ రోహిత్కు మద్దతుగా నిలిచాడు. భారత జట్టు అత్యుత్తమమైనది. ప్రపంచ కప్ లో రోహిత్ బాగా ఆడతాడు. పెద్ద టోర్నమెంటులో ఎప్పుడూ రోహిత్ తన బెస్ట్ ఇస్తాడు. అందుకే అతని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చాడు సౌరబ్ గంగూలీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: