బీజేపీ నేత లక్ష్మణ్: 3 నెలల తర్వాత రేవంత్ సర్కార్ ఉండదు..!

Pandrala Sravanthi
ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ ముగిసాయి.  ఈసారి ప్రధానంగా పోటీ బిజెపి, కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థులు మూడవ స్థానానికి వచ్చినట్లు సమాచారం. అలాంటి ఈ తరుణంలో అన్ని పార్టీల నాయకులు మాది విజయమంటే, మాది విజయమంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ సందర్భంలోనే బిజెపి సీనియర్ నాయకుడు కే లక్ష్మణ్ హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు.. ఈ సందర్భంగా ఆయన కొన్ని షాకింగ్ విషయాలు బయట పెట్టారు.

 దేశంలో ఎన్నికల ఓటింగ్ సరళి చూస్తే మాత్రం ఏకపక్షంగా  బిజెపి వైపు ఉన్నాయని అన్నారు. బిజెపి మొత్తం 370 స్థానాలు, ఎన్డీఏ కూటమితో కలిపి 400 స్థానాలు  గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇండియా కూటమికి ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేదని అన్నారు.  త్వరలో తెలంగాణలో కూడా బిజెపి బలమైన శక్తిగా ఆవిర్భవించబోతుందని తెలియజేశారు. ఇదే తరుణంలో తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు.  రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్లు వేస్తే అది ఫలించలేదని, ఆయన కూడా దొర కేసీఆర్ బాటలోనే ప్రయాణం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా చేశారని,  ఇక ఆ అప్పుల కుప్పను, మరింత అప్పుల కుప్పగా కాంగ్రెస్  మారుస్తున్నారని ఎద్దేవ చేశారు. ఆ అప్పులను కట్టేందుకు కాంగ్రెస్ మరిన్ని కొత్త అప్పులు చేస్తోందని అన్నారు.

ఇప్పటికే ధరణి, కాలేశ్వరం సమస్యలు అలాగే ఉండిపోయాయని ఆరోపించారు. త్వరలోనే బిఆర్ఎస్ పార్టీని కూడా కేసీఆర్ కాంగ్రెస్లో విలీనం చేస్తారని జోష్యం చెప్పారు. ప్రస్తుత కాలంలో గ్రామాల నుంచి పెద్ద పెద్ద పట్టణాల వరకు మోడీకి మద్దతు తెలుపుతున్నారని అన్నారు. దేవుళ్ళ మీద ఓట్లు వేసి రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి  చెప్పి మాట తప్పారని,  ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీ మరింత అప్పుల ఊబిలో పడిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుందని అన్నారు.  దీన్ని కూల్చేది కూడా వారి కాంగ్రెస్ నేతలే అని ఆరోపణ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిన తర్వాత ఎన్నికలు పెడితే బిజెపి తప్పక అధికారంలోకి వస్తుందని విశ్వసించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: