చంద్రబాబు: మహిళా శక్తికి న్యాయం చేస్తారా?

Divya
•తల్లికి వందనం పేరిట తల్లులకు న్యాయం చేస్తారా..
•ఉచిత బస్సు పథకం సఫలీకృతం అవుతుందా
•చంద్రబాబు ముందున్న ఈ అతిపెద్ద సవాళ్లు నెరవేరుతాయా..?

(చంద్రబాబు - ఇండియా హెరాల్డ్)
2019 ఎన్నికలలో ఓడిపోయి 2024 ఎన్నికలలో రెట్టింపు వేగంతో దూసుకొచ్చారు నారా చంద్రబాబు నాయుడు.. కూటమితో పొత్తు పెట్టుకుని ఏకంగా 164 సీట్లు సొంతం చేసుకొని.. రికార్డు సృష్టించారు.. ఇకపోతే ఈసారి ఎన్నికలలో విజయం సాధించారు కానీ ఆయన ముందున్న సవాళ్లు కోకోల్లలు.. వాటన్నింటినీ నెరవేర్చడంలో చంద్రబాబు సఫలం అవ్వాలి.. అప్పుడే ఇక ఆయనకు తిరుగు ఉండదు. ముఖ్యంగా  మహిళా ఓటర్లు చంద్రబాబును నమ్మి ఓటు వేసిన విషయం తెలిసింది.. పైగా ఓటు బ్యాంకులో ఎక్కువగా మహిళా ఓటర్సే చంద్రబాబు సీఎం కావాలని కోరుకున్నారు అలాంటి మహిళా శక్తికి చంద్రబాబు న్యాయం చేస్తారా..?  మేనిఫెస్టోలో మహిళల కోసం ఆయన ప్రకటించిన  హామీలను నెరవేర్చడంలో సఫలం అవుతారా ? అన్న అనుమానాలు ఇప్పుడు ఓటర్లలో వ్యక్తం అవుతున్నాయి..
ముఖ్యంగా 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఆడ కూతురికి నెలకు రూ .1500 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేస్తానని చెప్పారు.. ఇక ఈ హామీకి సుమారుగా కొన్ని వందల కోట్లు ఖర్చవుతుంది.. ఇలాంటి ఒక సవాలు ఆయన అధిగమిస్తారా..?
మరొకవైపు తల్లికి వందనం పేరిట.. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఒక్కొక్కరికి రూ.15000 చొప్పున ఏడాదికి ఇస్తానని హామీ ఇచ్చారు.. మరి పిల్లల చదువుల కోసం ఆర్థిక సహాయాన్ని అందజేస్తానని చెప్పిన చంద్రబాబు అందరికీ ఆర్థిక సహాయాన్ని అందించడంలో సఫలం అవుతారా..?
ముఖ్యంగా ప్రతి మహిళకు వంటింటికి మూడు సిలిండర్లు ఏడాదికి ఇస్తానని ప్రకటించారు చంద్రబాబు నాయుడు.. ఏడాదికి మూడు సిలిండర్స్ అంటే.. ఐదేళ్ల పరిపాలనలో దాదాపు 15 సిలిండర్లను ఒక్కో కుటుంబానికి ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది.. ఇలా ఇవ్వడం భారీ ఖర్చుతో కూడుకున్న పని..  మరి ఆయన ముందున్న ఈ సవాల్ ను ఎదుర్కొంటారా..?
మహిళలకు ఉచిత బస్సు.. తెలంగాణలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు పేరిట పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే .. చాలా మంది మహిళలకు . ముఖ్యంగా ఉద్యోగం చేసుకునే ఆడవారికి ఈ పథకం చాలా బెనిఫిట్ గానే ఉంది.. కానీ కొంతమంది ఈ పథకాన్ని దుర్వినియోగం చేయడం వల్లే అక్కడ గొడవలు కూడా జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.. అలాంటిదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రాలో మహిళలకు ఉచిత బస్సు పేరిట పథకాన్ని నిర్వహించబోతున్నారు.. ప్రమాణ స్వీకారం తర్వాత ఈ పథకం పై నిర్ణయం తీసుజూన్  అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్టీసీతో ఈ పథకం గురించి చర్చించాల్సి ఉంటుంది. ఈ పథకం వల్ల ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది ..పైగా ఆర్టీసీకి ఆ డబ్బు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.. ఇది కూడా చంద్రబాబు నాయుడు ముందు ఉన్న అతిపెద్ద సవాల్..
ఈ సవాల్ అన్నింటిని ఆయన నెరవేర్చి అధిగమించారంటే కచ్చితంగా విజయం సాధిస్తారు.. ఒకవేళ వీటిలో ఏ ఒక్కటి ఆయన నెరవేర్చకపోయినా మహిళా ఓటర్లు నిరాశ వ్యక్తం చేస్తారు.. కాబట్టి ఆయన ముందున్న ఈ అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొంటేనే మళ్ళీ సీఎం చంద్రబాబే అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: