విజయంతో కూడిన సవాళ్లు : ఈ 5 హామీలు నెరవేర్చితే మాత్రం కూటమికి తిరుగుండదా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాడా అనే చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు కోసం ఏపీ ఓటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే 5 ప్రధాన హామీలను అమలు చేస్తే మాత్రం చంద్రబాబు నాయుడికి తిరుగుండదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
చంద్రబాబు ప్రకటించిన పథకాలలో ఎక్కువమంది తల్లికి వందనం స్కీమ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చంద్రబాబు 15,000 రూపాయలు ఇస్తామని చేసిన ప్రకటన సంచలనం అయింది. ఈ ఒక్క హామీ నెరవేర్చాలంటే గతంలో ఖర్చు చేసిన మొత్తంతో పోల్చి చూస్తే రెట్టింపు మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ఏకంగా 45,000 రూపాయలు చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది.
 
50 సంవత్సరాల వయస్సు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పింఛన్ ఇస్తానని చంద్రబాబు సంచలన హామీ ఇచ్చారు. ఈ హామీ కూడా సులువుగా నెరవేర్చగలిగే హామీ అయితే కాదు. 50 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లకే పింఛన్ ఇవ్వడం ద్వారా ఆర్థిక భారం భారీ స్థాయిలో పెరుగుతుందని చెప్పవచ్చు. మరోవైపు నెలకు 4,000 రూపాయల చొప్పున పింఛన్ ఇస్తానని బాబు హామీ ఇచ్చారు. ఈ హామీ అమలుకే బడ్జెట్ లో ఎక్కువ మొత్తం నిధులు కేటాయించాల్సి ఉంటుంది.
 
మహిళలకు ఫ్రీ బస్, నెలకు 1500 రూపాయలు, ఫ్రీగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన హామీలు సైతం కూటమి విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా మహిళల ఓట్లు ఎంతో కీలకమనే సంగతి తెలిసిందే. ఇచ్చిన హామీలను అమలు చేసి మహిళా ఓటర్ల మెప్పు పొందడంలో బాబు ఎంతమేర సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది.
 
నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకొనిరావడం కూడా చంద్రబాబు ఇచ్చిన ప్రధాన హామీలలో ఒకటి కాగా ఈ హామీ మద్యం ప్రియులను ఎంతగానో ఆకర్షించింది. మద్యపాన నిషేధం అంటూ వైసీపీ అమలు చేసిన నిర్ణయాలపై మద్యం ప్రియుల్లో ఎంతో వ్యతిరేకత ఉంది. మద్యం విషయంలో జగన్ చేసిన తప్పులను బాబు చేయకుండా జాగ్రత్త పడితే మంచిదని చెప్పవచ్చు.
 
ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ప్రధాన కారణం ప్రభుత్వ ఉద్యోగులు అని చాలామంది భావిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీల విషయంలో న్యాయం చేస్తే మాత్రమే చంద్రబాబుకు తిరుగుండదు. చంద్రబాబు ముందున్న ఈ టార్గెట్లు భారీ టార్గెట్లు కాగా బాబు కష్టపడితే మాత్రం ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: