చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. అరుదైన రికార్డ్?

praveen
ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ బౌలర్ల లిస్టు తీస్తే మొదటి వరుసలో వినిపించే పేరు రషీద్ ఖాన్. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ తక్కువ సమయంలోనే ఏకంగా స్టార్ బౌలర్గా ఎదిగిన తీరు అమోఘం అని చెప్పాలి. తన స్పిన్ బౌలింగ్ తో ఏకంగా మహా బ్యాట్స్మెన్లను సైతం భయపెట్టేస్తాడు రషీద్ ఖాన్. అయితే కేవలం స్పిన్ బౌలర్ గా మాత్రమే కాకుండా జట్టుకు అవసరమైనప్పుడు బ్యాట్ కూడా జూలిపిస్తూ ఏకంగా అదరగొడుతూ ఉంటాడు అని చెప్పాలి.

 ఇక ఇప్పుడు వరకు ఎన్నోసార్లు అత్యుత్తమ ప్రదర్శన చేసే అతని ఎన్నో అరుదైన రికార్డులు కూడా సృష్టించాడు. అయితే తన స్పిన్ బౌలింగ్ తో ఎలాంటి బ్యాట్స్మెన్ ను అయినా తికమక పెట్టి వికెట్ను దక్కించుకోవడంలో రషీద్ ఖాన్ ను మించిన బౌలర్ మరొకరు లేరేమో అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఎంతటి స్టార్ బ్యాట్స్మెన్ అయినా సరే రషీద్ బౌలింగ్ చేస్తున్నాడు అంటే భారీ షాట్లు ఆడటం కాదు.. ముందు వికెట్ కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ప్రస్తుతం వరల్డ్ కప్ లో కూడా అదరగొట్టేస్తున్నారు రషీద్ ఖాన్. జట్టు విజయాలలో కీలకపాత్ర వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.

 అదే సమయంలో వ్యక్తిగత ప్రదర్శన విషయంలో కాదు.. ఇక జట్టును కెప్టెన్ గా కూడా సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. అయితే ఇటీవలే టి20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు ఈ ఆఫ్గనిస్తాన్ ప్లేయర్. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో రషీద్ ఖాన్ 17 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు అన్న విషయం తెలిసిందే. ఒక రకంగా కివిస్ ఓటమిని శాసించాడు ఈ స్టార్ బౌలర్. అయితే ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ వెటోరి పేరుతో ఉండేది. వెటోరి 4/20 గణాంకాలు నమోదు చేయగా.. ఇదే అత్యుత్తమంగా ఉండేది   కానీ ఇటీవల రషీద్ ఖాన్ 4/17 నమోదు చేయడంతో ఈ రికార్డు బ్రేక్ అయింది. అదే సమయంలో టి20 ఫార్మాట్లో ఏకంగా 17 సార్లు నాలుగు వికెట్ల ప్లస్ పడగొట్టిన ప్లేయర్ గా కూడా రికార్డు సృష్టించారు రషీద్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: