కలెక్షన్స్ లో దూసుకుపోతున్న విశ్వక్సేన్ " గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ".. ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసిందంటే..?

lakhmi saranya
టాలీవుడ్ మాస్ కా దాస్ గా పేరు సంపాదించుకున్న విశ్వక్సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ హీరో లేటెస్ట్ గా చేసిన మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.  ఈ చిత్రాన్ని చల్ మోహన్ రంగ మూవీ ఫేమ్ కృష్ణ చైతన్య రూపొందించారు. ఇక ఈ మూవీ విశ్వక్సేన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రంగా రూపొందింది. ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సమస్త బ్యానర్తో కలిసి ఫార్చున్ ఫోర్ బ్యానర్ పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్గా నిర్మించాడు.
ఇక ఈ చిత్రంలో విశ్వక్సేన్ కి జోడి గా నేహా శెట్టి మరియు అంజలి నటించారు. ఇక ఈ సినిమాకి యువన్ శంకర్ మ్యూజిక్ అందించాడు. ఈ మూవీ మే 31న గ్రాండ్గా థియేటర్లలో రిలీజ్ అయింది. విశ్వక్సేన్ పర్ఫామెన్స్ ప్రేక్షకులకు తెగ నచ్చిందని చెప్పుకోవచ్చు. దర్శకుడు కృష్ణ చైతన్య తన అద్భుతమైన టేకింగ్ తో అదరగొట్టాడు. ఇక ఇదిలా ఉంటే ఈ మూవీ ని యూఎస్ లో కాగ్నిర్ సినీ క్రియేషన్స్ బ్యానర్ విడుదల చేసింది. ఈ మూవీ యుఎస్ బాక్సాఫీస్ ప్రీమియర్స్ లో $275 కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసింది.
ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుత కాలంలో మన తెలుగు సినిమాలకి యూఎస్ లో ఎక్కువ శాతం లో కలెక్షన్స్ దక్కుతున్నాయి. అందుకే ఎక్కువ శాతం తెలుగు సినిమాలని యుఎస్ లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ప్రెసెంట్ వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న విశ్వక్సేన్ ఈ మూవీతో సూపర్ హిట్ కొట్టడంతో తన తదుపరిచిత్రం పై మరిన్ని హైప్స్ నెలకున్నాయి. ఇటీవల గామి మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ అందుకున్న విశ్వక్సేన్ మరోసారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో బ్లాక్ బస్టర్ కొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: