అమ్మతనం కావాలనుకుంది.. కానీ IVF చేయించుకుంటే ప్రాణం పోయింది?

praveen
తెల్లకోటు వేసుకొని మనిషి ప్రాణాలు కాపాడే వైద్యుడు ప్రత్యక్ష దైవం అని అంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే గుడికి వెళ్లి కోరితే దేవుడు వారాలు ఇస్తాడో లేదో తెలియదు. కానీ ఇక హాస్పిటల్ కు వెళ్తే.. కాపాడండి అంటే చాలు ఇక వైద్యుడు తప్పకుండా పునర్జన్మ ప్రసాదిస్తాడు. ఏకంగా తన ప్రాణాలను అడ్డుపెట్టి మరి పేషెంట్ ప్రాణాలను రక్షిస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అందుకే పునర్జన్మను ప్రసాదించే వైద్యుడిని ప్రత్యక్ష దైవం అని అంటూ ఉంటారు. అయితే కరోనా వైరస్ తర్వాత వైద్యుల గొప్పతనం ఏంటి అన్న విషయం ప్రతి ఒక్కరికి మరింత స్పష్టంగా అర్థమైంది.

 కనిపించని మహమ్మారితో ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తూ.. భయంతో గడపలోపలే ఉండి పోయిన సమయంలో.. వైద్యులు మాత్రం తమ కుటుంబ బాధ్యతలను సైతం పక్కనపెట్టి సమాజ హితం కోసం నడుం బిగించారు. ఇక వైద్యులు ఇంత సాహసం చేశారు కాబట్టే కోట్లాదిమంది ఇప్పటికీ ప్రాణాలతో ఉండగలిగారు అని చెప్పాలి. దీంతో వైద్యులపై ఉన్న గౌరవం కరోనా తర్వాత మరింత పెరిగింది. అయితే కొంతమంది వైద్యులు మాత్రం ఏకంగా డాక్టర్ వృత్తికే కళంకం తెచ్చే విధంగా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. పేషంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటనే వెలుగులోకి వచ్చింది.

 ఆ మహిళ అమ్మ కావాలని ఎంతగానో ఆశపడింది. ఎంత ప్రయత్నించినా ఆమెకు పిల్లలు కాలేదు. హాస్పిటల్స్ చుట్టూ తిరిగిన  ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఐవిఎఫ్ ద్వారా గర్భం దాల్చాలని అనుకుంది. ఈ క్రమంలోనే హాస్పిటల్ కి వెళ్తే.. అమ్మ కావాలనే కోరిక తీరకముందే ఆమె కానరాని లోకాలకు వెళ్ళిపోయింది. హైదరాబాద్ కూకట్పల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బేగంపేట్ లోని కుందన్ బాగ్లో నివాసం ఉంటున్న పరిణిత సంతానం కోసం ఐవీఎఫ్ చికిత్స చేసుకునేందుకు కెపిహెచ్బిలో కాలనీలోని ప్రసాద్ ఆస్పత్రిలో చేరింది. అయితే వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చివరికి వైద్యం వికటించి సదరు మహిళ మృతి చెందింది. కాగా కుటుంబ సభ్యులు ఈ విషయంఫై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: