రావణుడిని రౌడీలా చూపించారు.. 'రామాయణ్' సీతా కామెంట్స్ వైరల్?

praveen
ఇప్పటివరకు తెలుగులో మాత్రమే కాదు వివిధ భాషల్లో రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా వచ్చిన ఎన్నో మూవీస్ సూపర్ డూపర్ విజయాలు కూడా సాధించాయి. రాముడు అంటే ఇలాగే ఉంటారేమో.. సీతాదేవి అంటే ఇలాగే ఉండేదేమో అనే విధంగా ఇక ఆయా సినిమాల్లోని పాత్రధారులు తమ నటనతో మెప్పించారు అని చెప్పాలి. ఇక తెలుగులో ఎన్టీఆర్ ఇలా రాముడు కృష్ణుడి పాత్రల్లో ఒదిగిపోయి ఇక ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

 ఇక నేటి జనరేషన్ కి మాత్రం ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆది పురుష్ మూవీ రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కింది. అయితే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎందుకో ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయింది. అదే సమయంలో ఏకంగా రామాయణం ఇతిహాసాన్ని అపహాస్యం చేసేసారు అంటూ ఇక ఈ సినిమాపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల రామయణ్ సీరియల్ లో సీతగా నటించిన దీపిక చిక్లియా ఆది పురుష్ మూవీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

 ఆది పురుష్ సినిమాలో రావణుడిని ఒక రౌడీ లాగా చూపించడం ఎంతగానో బాధ కలిగించింది అంటూ రామాయం సీరియల్లో సీతగా నటించిన దీపిక చిక్లియా అన్నారు. శివ భక్తుడైన రావణుడిలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. సీతను అపహరించడమే ఆయన చేసిన తప్పు. సీతను గులాబీ రంగు చీరలో చూపటం.. రావణుడిని బిన్నమైన ఆహార్యంలో  చూపడం నచ్చలేదు. ఆ సినిమాను కొంత చూసి సరికి అస్సలు తట్టుకోలేకపోయాను. రామాయణం గొప్పతనాన్ని తగ్గించేస్తున్నారు అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దీపిక చిక్లియా కామెంట్స్ చేశారు. అయితే గతంలో రామాయణం సీరియల్ లో రాముడిగా నటించిన నటుడు సైతం ఆది పురుష్ మూవీ పై విమర్శలు గుప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: