సన్రైజర్స్ ప్లేయర్ ఊచకోత.. 26 బంతుల్లో సెంచరీ?

praveen
సాధారణంగా టి20 ఫార్మాట్ అంటేనే బ్యాట్స్మెన్ల విధ్వంసానికి మారుపేరుగా ఉంటుంది. ఎందుకంటే క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు చేయాలి అనే టార్గెట్ పెట్టుకొని వస్తాడు. దీంతో రావడం రావడమే సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ ఉంటాడు అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు బ్యాట్స్మెన్లు సృష్టించే విధ్వంసం ముందు ఇక బౌలర్ల వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. అయితే మొన్నటికి మొన్న ముగిసిన ఐపీఎల్ సీజన్ లో కూడా ఇలాగే జరిగింది అన్న విషయం తెలిసిందే. ఊచకోత అనే పదానికి ఈ ఐపిఎల్ సీజన్ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది.

 అంతర్జాతీయ క్రికెట్ లో అనుభవం ఉన్న స్టార్ బ్యాట్స్మెన్ల దగ్గర నుంచి అప్పుడప్పుడే క్రికెట్లో మెలకువలను నేర్చుకుంటున్న కొత్త ఆటగాళ్ల వరకు అందరూ ఐపీఎల్ సీజన్లో బ్యాటింగ్ విధ్వంసం అంటే ఏంటో చూపించారు. మరి ముఖ్యంగా సన్రైజర్స్ ఆటగాళ్లు అయితే ఎలాంటి ఆట తీరును కనపరిచారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే యువ ఆటగాడు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఊచకోత గురించి భారత క్రికెట్ ప్రేక్షకులు అంత తొందరగా మరిచిపోలేరు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే అతను అద్భుతంగా రాణించిన నేపథ్యంలో వరల్డ్ కప్ లో చోటు దక్కుతుంది అనుకున్నప్పటికీ అలా జరగలేదు.

  ఇలా ఐపీఎల్లో సన్రైజర్స్ తరఫున అదరగొట్టేసిన అభిషేక్ శర్మ ఇటీవల మరో మెరుపు సెంచరీ చేశాడు. గురుగ్రామ్ లో జరిగిన క్లబ్ మ్యాచ్ లో కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తూ సంచలనం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన  ఈ యువ విధ్వంసకర ప్లేయర్ ఏకంగా 26 బంతుల్లోనే 13 పరుగులు చేశాడు. అతను ఇన్నింగ్స్ లో నాలుగు ఫోర్లు 14 సిక్సర్లు ఉన్నాయి అంటే అతని ఊచకోత ఏ రేంజ్ లో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. 396 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. ఇది అధికారిక మ్యాచ్ కాకపోయినప్పటికీ ఇక అతను మెరుపు సెంచరీపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: