IND vs PAK మ్యాచ్.. టీమ్ ఇండియాకు బిగ్ షాక్.. రోహిత్ కు గాయం?

praveen
వరల్డ్ క్రికెట్లో ఎన్ని దేశాల మధ్య మ్యాచ్లు జరిగిన అటు ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే మాత్రం ఏదో తెలియని స్పెషల్ ఫీలింగ్. కేవలం రెండు దేశాల క్రికెట్ ప్రేక్షకులకు మాత్రమే కాదు ఇక ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఈ మ్యాచ్ చూసేందుకు తెగ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్లో ఉండే ఉత్కంఠను తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో.. అన్ని జట్ల మధ్య జరిగినట్లుగా ఇండియా, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగడం అసాధ్యమే.

 దీంతో ఆసియా కప్, వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీలలో మాత్రమే ఈ రెండు టీమ్స్ మధ్య పోరు జరుగుతూ ఉంటుంది. దీంతో సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి జరిగే ఈ బిగ్ ఫైట్ ని చూసేందుకు అందరూ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం యూఎస్, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో అటు అందరూ ఎదురుచూసిన మ్యాచ్ నేడు జరగబోతుంది. ఏకంగా నేడు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కాబోయే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ పోరును చూసేందుకు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే అటు టీమిండియా ఇంకోవైపు పాకిస్తాన్ జట్లు కూడా ఈ హై వోల్టేజ్ పోరు కోసం సిద్ధమవుతున్నాయి. అయితే ఇలా దాయాదుల పోరుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్ లో గాయపడినట్లు తెలుస్తుంది. నిన్న సాయంత్రం నెట్ ప్రాక్టీస్ లో హిట్ మ్యాన్ బొటనవేలికి గాయమైందట. ప్రాక్టీస్ పిచ్ లో బంతి ఓవర్ బౌన్స్ అవుతుందని.. icc కి బీసీసీఐ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే రన్ మిషన్ విరాట్ కోహ్లీ సైతం ఈ పిచ్ పై ఇబ్బంది పడ్డాడట. ఐర్లాండ్తో మ్యాచ్లో రోహిత్ శర్మ గాయంతో గ్రౌండ్ నుండి వెనుదిరిగిన విషయం తెలిసిందే. మరి నేడు జరగబోయే మ్యాచ్ లో రోహిత్ బరిలోకి దిగుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: