రామ్ చరణ్ పై ఉపాసన సంచలన వ్యాఖ్యలు..!

Divya
చాలామంది సినీ సెలబ్రిటీలు ఎక్కువగా డిప్రెషన్ లో ఉన్నామనే మాటలను చానా సార్లు తెలియజేశారు.. సినీ సెలెబ్రిటీలు ఎక్కువగా ఏ విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు.. అయితే ఇలాంటి సమస్య ఎదుర్కోవడానికి చాలా కారణాలు ఉన్నాయని కూడా తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి.ఇప్పుడు తాజాగా మెగా కోడలు ఉపాసన కూడా ఈ డిప్రెషన్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.. తాను డిప్రెషన్ ని కూడా ఎన్నోసార్లు ఎదుర్కొన్నానని రామ్ చరణ్ వల్లే ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డాను అని వెల్లడించింది ఉపాసన..

అసలు ఉపాసనకు ఎందుకు డిప్రెషన్ కి గురైందని విషయం గురించి.. ఉపాసన మాట్లాడుతూ అందరిలాగే తాను కూడా డెలివరీ తర్వాత చాలా ఒత్తిడికి గురయ్యాను చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని ఆ సమయంలో తన భర్త రామ్ చరణ్ తోనే తాను బయటపడగలిగానని వెల్లడించింది.. తనతో పాటు తన పుట్టింటికి కూడా వచ్చారని తనకు ఎంతో సహాయం చేశారని అందరికీ ఈ అదృష్టం దక్కదని కూడా తెలియజేసింది ఉపాసన.. క్లింకార విషయంలో కూడా చరణ్ చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటారని తెలిపింది.

ఇక తన భర్త తన కూతురిని చూసుకునే విధానం చూస్తే తనకు చాలా ఆనందం వేస్తుందని క్లింకార చాలా విషయాలలో చరణ్ లాగానే వ్యవహరిస్తూ ఉంటుందని తెలిపింది ఉపాసన.. అంతేకాకుండా ఆహారపు అలవాట్లు కూడా చరణ్ లాగానే తనకు ఉంటాయని చెప్పుకొస్తోంది ఉపాసన. అయితే ఇప్పటివరకు రామ్ చరణ్ కూతురు ఫేసు ఫుల్లుగా రివిల్ మాత్రం చేయలేదు మెగా కుటుంబం.. వివాహమైన 10 సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ కు ఉపాసనకు ఈ బిడ్డ జన్మించింది.. ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే గేమ్ చేంజర్ సినిమా లో నటిస్తున్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చిబాబు సన తో మరొక సినిమాలో నటించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: