'రంగస్థలం' లో రంగమ్మత్త పాత్ర కోసం మొదట ఆ స్టార్ హీరోయిన్ ని అనుకున్నారా?

Anilkumar
డైరెక్టర్ సుకుమార్ రామ్ చరణ్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ అనసూయ ఈ సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించింది. ఇక అనసూయ నటించిన ఈ పాత్రకు మంచి క్రేజ్ ను తెచ్చింది. అంతేకాకుండా పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మ్యూజిక్ ను దేవి శ్రీప్రసాద్ అందించారు. ఇక అనసూయకు రంగస్థలం సినిమా ద్వారా క్రేజ్ పెరగడంతో వరుస సినిమాలు  చేస్తూ బిజీగా ఉంది. ఇక అసలు విషయానికి వస్తే..

రంగస్థలం సినిమాలో అనసూయ నటించిన పాత్ర కోసం ముందుగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చేసిన రాశిని సంప్రదించారట. అయితే తనకు డ్రెస్సింగ్ స్టైల్ నచ్చక నో చెప్పిందని సమాచారం. రాశికి సినిమా అవకాశాలు తగ్గటంతో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను కూడా నటించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఇక రాశి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సక్సెస్ గా ముందుకు సాగుతోంది. రాశి సెకండ్ ఇన్నింగ్స్ లో బుల్లితెరపై అదరగొడుతోంది.  ఈ సీరియల్లో జ్ఞానాంబగా నటిస్తోంది. ఈ సీరియల్ ప్రస్తుతం టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది.

ఈ సీరియల్ లో ముఖ్యంగా కాశీ పాత్రకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. దియా ఔర్ బాతి హామ్ కు హిందీలో వచ్చిన ఈ సీరియల్ ఇప్పుడు రాశి తిరిగి తెలుగులో రీఎంట్రీ ఇచ్చి అభిమానులు ఆకట్టుకుంటున్నారు. దీని తర్వాత ఇతర చానల్స్ లోనూ వరుస సీరియల్ అవకాశాలు అందుకుంది. ఇక సీరియల్స్ కి ఈ హీరోయిన్ తీసుకునే రెమ్యునరేషన్ కూడా ఓ రేంజ్ లో ఉందని సమాచారం. రాశి సీరియల్స్ లో ఒక్క ఎపిసోడ్ కి గాను సుమారు లక్ష రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం స్టార్ మా, జీ తెలుగు వంటి చానల్స్ లో ప్రసారమయ్యే కొన్ని సీరియల్స్ లో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: