మందుగ్లాస్ తో హల్ చల్ చేస్తున్న స్టార్ యాంకర్ రష్మీ..!!

murali krishna
ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు వార్తల్లో నిలవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తున్నారు. కాస్తా ఫేమస్ వస్తే చాలు దానిని నిలబెట్టుకోవడానికి నానాతంటాలు పడుతున్నారు. ఇప్పుడు సరిగ్గా ఇదే పనిలో నిమగ్నమైంది ఓ ప్రముఖ యాంకర్. బుల్లితెర యాంకర్ రష్మి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మి.. సినిమాల్లో సరైన అవకాశాలు దొరక్కపోవడంతో బుల్లితెర మీద యాంకర్ అవతారం ఎత్తింది.జబర్థస్త్ షోలో యాంకర్‌గా కనిపించిన తరువాత రష్మి జాతకమే మారిపోయింది. జబర్థస్త్ షో రష్మికి ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా రష్మి -సుడిగాలి సుధీర్‌ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. టీవీ రంగంలో రష్మి -సుడిగాలి సుధీర్‌లపెయిర్ సంచలనం సృష్టించారని అని చెప్పాలి. వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు ఆ షో సూపర్ హిట్ అనే రేంజ్‌కి వెళ్లిపోయిందంటే వీరి క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో రష్మి పలు సినిమాల్లో హీరోయిన్‌గా కూడా అవకాశాలు దక్కించుకుంది.ఇదిలా ఉంటే రష్మి జంతు ప్రేమికురాలనే విషయం అందరికి తెలిసిందే. కరోనా సమయంలో కూడా ఆమె రోడ్డు మీద ఉన్న జంతువులకు ఆహారం అందించి తన ఉదారతను చాటుకుంది. జంతువులను ఎవరైనా హింసిస్తే ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుందామె. ఇదిలా ఉంటే రష్మి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలతో పాటు, కెరీర్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ భామ తన పుట్టిన రోజు వేడుకులు ఘనంగా జరుపుకుంది. స్నేహితులతో కలిసి విదేశంలో పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. తాజాగా తన బర్త్‌డే పార్టీలో ఎంజాయ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే అందులో మందు గ్లాస్‌తో ఉన్న రష్మి ఫొటోను చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ముందు మందు గ్లాస్ పెట్టుకొని ఉన్న ఫోటోను షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అవుతుంది. రష్మీ మందు గ్లాస్‌తో తన పుట్టిన రోజును గ్రాండ్‌గా జరుపుకుంటుందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. రష్మి మందు గ్లాసుతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: