"ప్రియదర్శి" లేటెస్ట్ మూవీ అప్డేట్ వచ్చేసింది..!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం ప్రియదర్శి ఫుల్ జోష్ లో కెరియర్ నీ ముందుకు సాగిస్తున్నాడు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన ఈ మధ్య కాలంలో సినిమాల్లో ముఖ్య పాత్రాల్లో నటించడం కంటే కూడా హీరోగా ఎక్కువగా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా పోయిన సంవత్సరం ఈయన వేణు దర్శకత్వంలో బలగం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది.

ఈ మూవీ తో హీరో గా ప్రియదర్శి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దానితో ప్రస్తుతం ఈయన అనేక సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ప్రియదర్శి హీరోగా నబా నటేష్ హీరోయిన్ గా డార్లింగ్ అనే మూవీ అనౌన్స్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఈ రోజు ప్రియదర్శి మరో మూవీ కి సంబంధించిన అప్డేట్ కూడా బయటకు వచ్చింది. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి అలాగే జాన్వీ నారంగ్ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నట్టుగా తాజాగా కన్ఫర్మ్ అయ్యింది. స్పిరిట్ మీడియా ... ఎస్ వి ఏ సి ఎల్ ఎల్ పి వారి సమర్పణలో ఈ మూవీ రూపొందబోతుంది.

ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని వివరాలు మరికొన్ని రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు మూవీ లలో మాత్రమే కాకుండా ప్రియదర్శి ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ మూవీ లో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఇలా ప్రస్తుతం ప్రియదర్శి మూడు సినిమాల్లో హీరో గా నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: