నేను వాటిని ఎప్పుడో దాచుకున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన యంగ్ హీరోయిన్..!!

murali krishna
ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలు 'ఎగ్ ఫ్రీజింగ్' ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు. ఎగ్ ఫ్రీజింగ్ అంటే.. మనం హెల్తీగా ఉన్నప్పుడే పిల్లలు పుట్టడానికి ఉపయోగపడే అండాల్ని భద్రపరుచుకునే ప్రోసెస్‌ను ఎగ్ ఫ్రీజింగ్ అంటారు.ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ఈ విధానాన్ని ఫాలోఅవుతున్నారు. ఇటీవల టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మెహ్రీన్ కూడా తన ఎగ్స్ దాచుకున్న విధానాన్ని ఇన్‌స్టా ద్వారా తెలియజేసింది. అలాగే మృణాల్ కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటానని తెలిపింది. కానీ వీళ్లంతా ఇప్పుడు ప్లాన్ చేసు కుంటున్నారు. నేను నా ఎగ్స్‌ను ఎప్పుడో భద్ర పరుచుకున్నాను అంటుంది ప్రముఖ హీరోయిన్ ఈషా గుప్తా.2012 లో 'జన్నత్ 2' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈషా.. రాజ్ త్రీడీ, హయ్ షకల్స్, రుస్తుమ్, టోటల్ ధమాల్ వంటి సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. అంతే కాకుండా ప్రస్తుతం వరుస మూవీస్‌తో దూసుకుపోతున్న ఈ అమ్మడు చేతిలో.. హెరీ ఫెరీ 4, దేశీ మ్యాజిక్ అండ్ మర్డర్ 4 చిత్రాలు ఉన్నాయి. ఇక సినిమాలతో పాటు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈషా పిల్లల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. 'నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. నేను ఒకవేళ హీరోయిన్ కాకపోయి ఉంటే ఈపాటికే పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలకు తల్లిని అయ్యేదాన్ని. అంత ఇష్టం నాకు పిల్లలు అంటే. అందుకే నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడే నా అండాల్ని 2017లోనే భద్రప రుచుకున్నాను' అంటూ చెప్పుకొచ్చింది. ఇక గత ఐదేళ్ల నుంచి మాన్యువల్ కంపోస్ అనే యువ పారిశ్రామిక వేత్తతో రిలేషన్‌ లో ఉన్న ఈషా గుప్తా.. తర్వలో అతడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: