"ఇండియన్ 2" కోసం రంగంలోకి దిగనున్న "చరణ్"..?

MADDIBOINA AJAY KUMAR
లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో చాలా సంవత్సరాల క్రితం ఇండియన్ అనే మూవీ రూపొంది అద్భుతమైన విజయం అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీతో కమల్, శంకర్ క్రేజ్ అద్భుతమైన రీతిలో పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే ఇండియన్ మూవీ విడుదల అయిన చాలా సంవత్సరాల తర్వాత ఈ మూవీకి కొనసాగింపుగా కమల్ హాసన్ హీరోగా శంకర్ "ఇండియన్ 2" అనే మూవీ ని ప్రారంభించాడు. ఈ మూవీ ని ప్రారంభించి కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.

దానితో శంకర్ , రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే మూవీ ని మొదలు పెట్టాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తి అయిన తర్వాత మళ్లీ శంకర్ , కమల్ హీరోగా "ఇండియన్ 2" మూవీ ని తిరిగి ప్రారంభించాడు. దానితో శంకర్ ఇటు "ఇండియన్ 2" అటు "గేమ్ చేంజర్" రెండు సినిమాలను ఒకే సారి పూర్తి చేసుకుంటూ వచ్చాడు. ఇప్పటికే "ఇండియన్ 2" మూవీ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది.

ఈ మూవీ ని జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వారు ప్రకటించారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో మే నెలలో ఈ మూవీ యూనిట్ "ఇండియన్ 2" కి సంబంధించిన పాటలను విడుదల చేయడం కోసం భారీ ఎత్తున ఆడియో లాంచ్ ఈవెంట్ ను చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇలా "ఇండియన్ 2" మూవీ కోసం రామ్ చరణ్ ని రంగం లోకి దించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే "ఇండియన్ 2" మూవీ లో కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలలో కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: