ఆకట్టుకుంటున్న "బాక్" ట్రైలర్..!

Pulgam Srinivas
తమన్నా , రాశి కన్నా ప్రధాన పాత్రలో "అరుణ్మనై 4" అనే తమిళ మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సిరీస్ లో భాగంగా ఇప్పటివకరు వచ్చిన 3 మూవీ లు వచ్చాయి. కోలీవుడ్ అవి మంచి విజయాలను సాధించాయి. ఈ సిరీస్ లోని మూవీ లు తెలుగు లో కూడా విడుదల అయ్యాయి. ఇది ఇలా ఉంటే "అరుణ్మనై 4" సినిమా కూడా తెలుగు లో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు లో "బాక్" అనే  టైటిల్ తో విడుదల కానుంది. ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను ఇప్పటికే ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది.
 

ఈ విషయాన్ని కూడా ఈ మూవీ యూనిట్ వారు ప్రకటించారు. ఈ మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా ... శివాని పాత్రలో కనిపించనుండగా రాశి కన్నా ... మాయ పాత్రలో కనిపించబోతుంది. రాశి కన్నా ఇప్పటికే "అరుణ్మనై 3" లో హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను కొన్ని రోజుల క్రితం వరకు ఏప్రిల్ 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత ఈ సినిమాను ఏప్రిల్ 26 వ తేదీన విడుదల చేయడం లేదు అని కొత్త విడుదల తేదీని మరికొన్ని రోజుల్లోనే ప్రకటిస్తామని ఈ చిత్ర బృందం ప్రకటించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాని మే 3 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది.

ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బృందం నుండి ఈ సినిమాకు (యూ / ఏ) సర్టిఫికెట్ లభించింది. ఆ విషయాన్ని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఏ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రకారం చూసినట్లు అయితే ఇందులో తమన్నా దయ్యం పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆధ్యాతం ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ సినిమాపై ఈ ట్రైలర్ ద్వారా అంచనాలు భారీగానే పెరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bak

సంబంధిత వార్తలు: