సమంత "మా ఇంటి బంగారం" టైటిల్... ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె ఇప్పటికే ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాలుగా స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించిన ఈ బ్యూటీ కి ఈ మధ్యక్కాలంలో మాత్రం వరస అపజయాలే ఎదురు అవుతున్నాయి. కొంత కాలం క్రితం ఈ బ్యూటీ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా నటించింది.
 

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఈ బ్యూటీ కి నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత ఈమె విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఖుషి అనే లవ్ రొమాంటిక్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.  తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల ఈ సినిమా కూడా ఈ బ్యూటీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని మిగిల్చింది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన లేటెస్ట్ మూవీ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయింది. తాజాగా సమంత "మా ఇంటి బంగారం" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు తెలియజేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

ఇందులో సమంత గన్ పట్టుకొని ఉంది. ఇక ఈ పోస్టర్ లో సమంత మెడలో తాళి బొట్టు ఉండడంతో ఈమె ఒక ఫ్యామిలీ లేడీ పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ సమంత నే నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ కి సంబంధించిన డైరెక్టర్ , ఇతర నటీనటులు , టెక్నిషన్ ల వివరాలు తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ మూవీ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ జనాలను బాగా ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: