కూట‌మి సర్కార్ దెబ్బ‌... రాంగోపాల్ వ‌ర్మ - పోసాని - శ్రీ రెడ్డి ముగ్గురు ఇరుక్కుపోయారుగా... !

RAMAKRISHNA S.S.
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు సినిమా రంగానికి చెందిన కొందరు సెలబ్రిటీలు అప్పట్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలతో పాటు జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. ఇలాంటి వారిలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. సినీనటుడు వైసీపీ సీనియర్ నాయకుడు పోసాని కృష్ణ మురళి.. వైసీపీకి సపోర్టుగా ఉండే నటి శ్రీరెడ్డి లాంటివాళ్ళు ఉండేవారు. వీళ్లు ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశంకు చెందిన నేతలతో పాటు చంద్రబాబు .. లోకేష్ .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోస్టులు పెట్టేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారిపై కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు అయింది. ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఎన్నికల ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ లో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆయన ఎక్స్‌లో పోస్టులు పెట్టారు. దీనిపై ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఈ మేరకు విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు ఒక బృందంగా ఏర్పడి మంగళవారం రాత్రి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు. బుధవారం వర్మకు పోలీసులు నోటీసులు అందజేసే అవకాశం ఉంది.

అలాగే విజయవాడలోని భవానిపురం పోలీస్ స్టేషన్ లో సినీ నటుడు వైసీపీ నాయకుడు krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పోసాని కృష్ణమురళి పై జనసేన నాయకులు మంగళవారం ఫిర్యాదు చేశారు. 2021 లో వైసీపీ కార్యాలయం వేదికగా పవన్ కళ్యాణ్ పై పోసాని తీవ్రంగా విమర్శలు చేశారని.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైసీపీ ఎక్కువగా వినియోగిస్తూ పవన్ కళ్యాణ్ ప్రతిష్ట దెబ్బతీస్తుందని కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో చంద్రబాబు - పవన్ కళ్యాణ్ - లోకేష్ - వంగలపూడి అనిత పై దుర్భాషలాడుతున్న నటి శ్రీరెడ్డి పై చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళా సభ్యులు అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డి పై చర్యలు తీసుకోవాలని వారు తమ కేసులో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: