రామ్ చరణ్ పేరు వెనుక ఇంత కథ ఉందా. సీక్రెట్ చెప్పిన పవన్ కళ్యాణ్..!
ఈ క్రమంలోనే రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ గొప్పగా పొగడడం జరిగింది పవన్ కళ్యాణ్. ముఖ్యంగా రామ్ చరణ్ కు ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయం పైన కూడా తెలిపారు. రామ్ చరణ్ చిన్న వయసు నుంచే చాలా కష్టపడ్డారని చరణ్ గొప్పతనం గురించి భక్తి గురించి వెల్లడించారు.. చరణ్ పేరు వెనుక ఉన్న కథను తెలియజేస్తూ.. మా కుటుంబం మొత్తం ఎక్కువగా ఆంజనేయ స్వామి భక్తులము.. నేను ఇంటర్లో ఉన్నప్పుడు రామ్ చరణ్ పుట్టాడు. తన అన్నయ్యకు అబ్బాయి పుట్టాడని నాన్నగారు ఎంతో ఆలోచించి రాంచరణ్ అని పేరు పెట్టారట.
రాముని చరణాల వద్ద ఉండేవారు ఆంజనేయస్వామి అని.. ఆయనకి చాలా బలం ఉన్న వినయ విధేయత గానే ఉంటారని.. హనుమాది సిద్ధులు ఉన్నా కూడా ఎంత వినయంగా ఉండేవారు.. అందుకే తన అన్న కొడుకు అయినా రామ్ చరణ్ కి ఈ పేరు పెట్టారు అంటూ తెలిపారు. పేరుకు తగ్గట్టుగానే రామ్ చరణ్ ఉంటున్నారు అంటూ పవన్ కళ్యాణ్ వెల్లడించడం జరిగింది. మొత్తానికి రామ్ చరణ్ పేరు వెనుక స్టోరీని తెలిపారు పవన్ కళ్యాణ్.