పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. వీరమల్లు ట్రైలర్ వచ్చేస్తుంది..!!

frame పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. వీరమల్లు ట్రైలర్ వచ్చేస్తుంది..!!

murali krishna
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి సినిమా కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. పవన్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'హరి హర వీరమల్లు'.. ఈ బిగ్గెస్ట్ మూవీ అడ్డంకులు అన్నీ అధిగమించి ఎట్టకేలకు మే9న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కార్యక్రమాలు మొత్తం దాదాపుగా పూర్తి అయ్యాయని, డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టేసినట్లు, కేవలం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన నాలుగు రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉందని తెలుస్తుంది.ఏప్రిల్ మొదటి వారం లో ఆ బ్యాలన్స్ షూట్ కూడా పూర్తి అవుతుందని సమాచారం.. సుమారుగా 5 ఏళ్ళ నుండి ఫ్యాన్స్ ని ఊరిస్తూ వస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాకు  మళ్ళీ భారీ హైప్ తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు... 

ఇప్పటికే విడుదలైన రెండు పాటలలో ‘కొల్లగొట్టినాదిరో’ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఆ సాంగ్ కి యూట్యూబ్ లో మంచి వ్యూస్ వస్తున్నాయి.. అలాగే ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ తో కూడా ఆ పాట ఫుల్ పాపులర్ అయింది.అయితే సినిమాపై ఊహించని హైప్ రావాలంటే ఇది సరిపోదు..అందుకే ఈ ఉగాది నుండి ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ ని గ్రాండ్ గా మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఉగాది సందర్భంగా సరికొత్త పోస్టర్ ని మేకర్స్ విడుదల చేస్తారట.

 ఆ తర్వాత ఏప్రిల్ మొదటి వారం లో ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో ని కూడా విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఈ మేకింగ్ వీడియో ‘హరి హర వీరమల్లు’ సినిమాపై ఊహించని హైప్ వచ్చే అవకాశం వుంది..
ఇక ఆ తర్వాత మూడవ లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేసి, ఏప్రిల్ రెండవ వారం లో థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: