తెలంగాణ: మహిళలకు గుడ్ న్యూస్.. రూ.2,500 అప్పటినుండే..!

Pandrala Sravanthi
ఎలక్షన్స్ వచ్చాయంటే చాలు ప్రజాప్రతినిధులు ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నో రకాల పథకాలు ముందుకు తీసుకువస్తారు. ఎన్నో హామీలు ఇస్తారు.కానీ ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోయి గెలిచారంటే చాలు పథకాలను పక్కనపెట్టి హామీలను మూలన పడేస్తారు. అయితే తెలంగాణలో 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ ఆరు గ్యారెంటీలలో కొన్ని పథకాలు అమలు అయితే కొన్ని పథకాలు అమలు కాలేదు. దీంతో బిఆర్ఎస్, బిజెపి ఈ విషయాలని ఎత్తిచూపుతూ పదేపదే కాంగ్రెస్ ని విమర్శిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడికి వెళ్లినా కూడా ఆరు గ్యారెంటీల హామీ ఏం చేశారు అని బీఆర్ఎస్, బిజెపి ప్రశ్నిస్తుంది.


ఇక ఈ విషయం పక్కన పెడితే తాజాగా మహిళలకు 2,500,పింఛన్ల పెంపు విషయంపై గుడ్ న్యూస్ తెలిపారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్.. తాజాగా సంపత్ కుమార్ గద్వాల జిల్లాలోని ఐజ లోని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని మేము గుర్తు పెట్టుకున్నాం. ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేశాం.కానీ కేసీఆర్ ప్రభుత్వం వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టడం కోసం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు.అందుకే మిగిలిన పథకాలు అమలు చేయలేకపోతున్నాం. కానీ ఈ ఏడాది మార్చి తర్వాత పింఛన్లు నాలుగు వేలకు పెంపు,మహిళల ఖాతాలో 2500 జమ వంటి పథకాలు కూడా అమలు చేస్తాం.. అంటూ కాంగ్రెస్ ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ గుడ్ న్యూస్ చెప్పారు.


అయితే ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు వైరల్ గా మారడంతో చాలామంది తెలంగాణ లోని మహిళలు పింఛన్లు తీసుకునే వారు సంబర పడిపోతున్నారు. మార్చ్ తర్వాత ఈ రెండు పథకాలు అమలు అవుతాయని చెప్పడంతో సంతోషపడుతున్నారు. కానీ మరి కొంత మందేమో ఎలక్షన్స్ లో గెలవడం కోసం పింఛన్ల పెంపు మహిళల ఖాతాల్లోకి 2500 అనే కొత్త నాటకం ఆడుతున్నారని,ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోయాయి అంటే మళ్ళీ వాటి ఊసేఎత్తరని కొట్టిపారేస్తున్నారు. మరి నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి తర్వాత పింఛన్ల పెంపు, మహిళల ఖాతాలో 2500 జమ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: