వింత చట్టం.. అక్కడ 14 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చు?

praveen
మనదగ్గర వివాహం చేసుకోవడానికి సగటు స్త్రీ పురుషుడు ఇద్దరూ 18 ఏళ్ల వయసుని దాటి ఉండడం అనేది కనీస అర్హతగా మన ప్రభుత్వాలు నిర్ణయించాయనే విషయం అందరికీ తెలిసినదే. కానీ బొలీవియాలో అలా కాదు. అక్కడ 14 సంవత్సరాలకే పెళ్లి చేసుకోవచ్చనే రూల్ ఉంది. అదేవిధంగా అక్కడి కొన్ని రాజవంశాలలో కూడా, వివాహం చేసుకోవడానికి కనీస వయస్సుగా 14 సంవత్సరాలు వయస్సుని నియమంగా పెట్టడం జరుగుతోంది. ఎందుకంటే ఈ దేశంలో దాదాపుగా 14 సంవత్సరాలు నిండిన యువతీయువకులు తమ భాగస్వాములను ఎంచుకొనే సంప్రదాయం ఉందట. అందుకే అదే వయస్సుని అక్కడ కనీస అర్హతగా పరిగణించినట్టు తెలుస్తోంది. మరోవైపు అక్కడ పిల్లల కొరత ఎక్కువగా ఉన్న కారణంగా ఈ సగటు వయస్సుని కుదించినట్టు కూడా తెలుస్తోంది.
అయితే సాధారణంగానే దేశాలు, అక్కడి రూల్స్‌ను బట్టి వివాహం చేసుకునే వయస్సులో చాలా తేడాలు అనేవి ఉండడం సర్వసాధారణం. ఇండియాతో పాటు దాదాపు అన్ని దేశాల్లో కూడా వివాహం చేసుకోవాలంటే అబ్బాయికి 21, అమ్మాయికి 18 ఏళ్లు నిండాల్సిందే. కానీ బొలీవియాతో పాటుగా మరికొన్ని దేశాలలో ఆడవారికి 14, మగవారికి 16 ఏళ్లుంటే వివాహానికి అర్హులుగా పరిగణిస్తారు. ఇక మన పొరుగుతున ఉన్న దేశం చైనాలో ఆడదానికి 20, మగవారికి 22 ఏళ్లు ఉండాల్సిందే. ఇక అఫ్గానిస్థాన్‌లో ఆడవారికి 16, మగవారికి 18గా ఉంది. యూరప్‌లోని అండోరాలో అయితే ఇద్దరికీ 16 ఏళ్లు ఉంటే సరిపోతుంది. అదేవిధంగా బహామాస్‌లో పేరెంట్స్ పర్మిషన్‌తో 15 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చు.
ఇక చైనాలో ప్రారంభ సమాజాలలో యుక్తవయస్సు వచ్చిన కొన్ని సంవత్సరాలకే అంటే మహిళలకు 15 మరియు పురుషులకు 20 రాగానే వివాహాలు జరిగిపోయేవి. ముఖ్యంగా అక్కడి హాన్ రాజవంశం కట్నం వంటి వివాహం చుట్టూ చాలా విస్తృతమైన సంప్రదాయాలను ప్రవేశపెట్టింది. ఆ తరువాత క్రమంలో ఈ సంప్రదాయం కనుమరుగు అవుతూ వచ్చింది. ఇకపోతే ఇప్పటి ఆధునిక తూర్పు ఆసియా దేశాలలో డేటింగ్ సంస్కృతి పశ్చిమ ఐరోపా దేశాలతో సమానంగా ఉంది. డేటింగ్ కి సిద్ధపడే పురుష, స్త్రీలు కూడా సగటు వయస్సుని దాటితేనే అక్కడ చట్టబద్ధం అవుతుంది... లేదంటే శిక్షార్హులుగా పరిగణిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: