ప్రియదర్శి హీరోగా నటిస్తున్న మూవీలు ఎన్నో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న యువ నటులలో ప్రియదర్శి ఒకరు . ఈయన విజయ్ దేవరకొండ హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన పెళ్లి చూపులు అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు . ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం ఇందు లో ప్రియదర్శి తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆ తర్వాత నుండి ఈయనకు వరుసగా సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి.

ఇకపోతే ఈయన సినిమాల్లో ఎలాంటి పాత్ర అయిన చేయడానికి రెడీగా ఉండటంతో ఈయనకు సినిమాల్లో కీలకపాత్రలలో , ముఖ్య పాత్రలలో మాత్రమే కాకుండా హీరోగా కూడా అవకాశాలు దక్కుతున్నాయి. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో హీరోగా నటించిన ఇతను చాలా మంచి విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం కూడా ప్రియదర్శి మూడు క్రేజీ మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు. ఆ సినిమాలు ఏవి వాటి వివరాలు తెలుసుకుందాం. ప్రియదర్శి ప్రస్తుతం డార్లింగ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని నబా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

అశ్విన్ రామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ తో పాటు నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో ఎస్ వి సి ఎల్ ఎల్ పి మరియు స్పిరిట్ మీడియా బ్యానర్ లో రూపొందుతున్న ఓ మూవీ లో కూడా ప్రియదర్శి హీరోగా నటిస్తున్నాడు. అలాగే ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో రూపొందుతున్న ఓ మూవీ లో కూడా ప్రియదర్శి హీరో గా నటించబోతున్నాడు. ఇలా ఈ నటుడు ప్రస్తుతం మూడు సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: