ఏపీ కేబినెట్ కూర్పు..డేంజర్ జోన్లో ఆ నలుగురు.?

FARMANULLA SHAIK
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతోంది. ఇప్పుడిప్పుడే పాలన కుదుటపడుతోంది. ఇటువంటి సమయంలోనే మంత్రుల తొలగింపు ఒక వార్త హల్చల్ చేస్తోంది.  జనసేనకు మూడు, బిజెపికి ఒక మంత్రి పదవి ఇచ్చారు.  ఒక పోస్టు ఖాళీగా ఉంచారు. ఇప్పుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా ఆ ఖాళీని భర్తీ చేయనున్నారు.  అయితే ఒక్క నాగబాబు కాదు… ఆయనతో పాటు మరో ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తోంది.ఇదే క్రమంలో అయితే నాగబాబు ప్రమాణంతో పాటు.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావుకు కూడా మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఉన్నది ఒకే పదవి కావడంతో ఇద్దరికి ఎలా అవకాశం ఇస్తారని సొంత పార్టీ నేతలే ప్రశ్నలు సంధించికున్నట్టు తెలిసింది. అయితే ప్రస్తుత కేబినెట్‌లో సరిగ్గా పనిచేయని మంత్రులకు ఉద్వాసన పలుతారని పార్టీ పెద్దలు చెప్పడంతో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా షాక్‌ అయ్యారట. 
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కనీసం ఏడాది కూడా పూర్తవక ముందే మంత్రులకు ఉద్వాసన పలకడం ఏంటని గుసగుసలాడుకుంటున్నారట. 

ఈ క్రమంలో డేంజర్ జోన్ లో వున్నా మంత్రులు ఎవరనగా రామచంద్రాపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్‌,అలాగే ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రిపై కూడా వేటు పడే అవకాశం ఉందని అంటున్నారు.మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కు సైతం మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికే చాన్స్‌ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అటు మంత్రి అచ్చెన్నాయుడు దగ్గర ఎక్కువ శాఖలు ఉండటంతో ఆయన దగ్గర నుంచి కొన్ని శాఖలను ఇతరులకు మార్చే అవకాశం ఉందని అంటున్నారు.మొత్తంగా కూటమి సర్కార్‌లో నలుగురు మంత్రులపై వేటు పడటం పక్కా అంటున్నారు. కానీ జనసేన పార్టీలో ఏ మంత్రికి ఉద్వాసన పలుకుతారనేది మాత్రం హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఇదిలావుండగా ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన పదిమందికి మంత్రి పదవులు ఇచ్చారు. మూడు ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం కల్పించారు. పనితీరు బాగా లేకుంటే మార్చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఒకరిద్దరు మంత్రుల వ్యవహార శైలి పై అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రుల ఉద్వాసన ఉంటుందని ఒక ప్రచారం బలంగా నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: