హాట్ టాపిక్: మైసూర్‌పాక్.. రసగుల్లా.. స్వీట్స్ కాదండోయ్... రసిక రాజాలు?
పోలీసులు విచారణలో భాగంగా అందమైన ఓ యువతి సెల్‌ఫోన్ ఓపెన్ చేసిన అధికారులకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. ఈ క్రమంలో ఆమెతో ‘టచ్’లో ఉన్న వారి పేర్లు చూసి అవాక్కయ్యారు. విషయం ఏమిటంటే, మాజీ మంత్రి వర్తూరు ప్రకాశ్‌తో తనకున్న స్నేహాన్ని అడ్డుపెట్టుకుని వంచనకు పాల్పడిన శ్వేతా గౌడ అనే ఆమెని బెంగళూరు కమర్షియల్ స్ట్రీట్, భారతినగర ఠాణా పోలీసులు విచారించగా అనేక శృంగార లీలలు బయటకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె తన ఫోన్లో వర్తూరు ప్రకాశ్ పేరును 'మైసూరు పాక్'గా నమోదు చేసుకోగా, మరో భాజపా నాయకుడి పేరును గులాబ్ జామూన్‌గా, వేరొక స్థానిక నేత పేరును 'రసగుల్లా'గా పెట్టుకుంది.
అంతేకాదండోయ్... ఇలానే మరికొందరి సో కాల్డ్ రాజకీయ నాయకులకి కూడా ఆమె ‘స్వీట్’ నామధేయాలను చాలా హాట్ గా పెట్టినట్టు గుసగుసలు వినబడుతున్నాయి. అంతేకాకుండా శ్రీమంతులు అనబడే బడాబాబుల కొడుకుల నామధేయాలకు బదులు '5 స్టార్', 'కిట్ కేట్', 'డైరీ మిల్క్' వంటి చాకోలెట్ పేర్లను పెట్టి నగదు సంపాదన కోసం వారికి గాలం వేసేదని అనుమానిస్తున్నారు అధికారుల. ఇప్పటికే ఇలా పలు రకాల వంచనలతో వచ్చిన సొమ్ముతో కొనుగోలు చేసుకున్న విలాసవంతమైన కారులో తిరుగుతూ, పరపతి, పలుకుబడి ఉండేవారితో ఆమె తన స్నేహాన్ని అందరికీ సమానంగా పంచడంతో ఆమె వలలో చాలామంది పడ్డారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ క్రమంలోనే కమర్షియల్ స్ట్రీట్లో ఆమె వంచనకు ఓ నగల వ్యాపారి కూడా బలయ్యాడని సమాచారం. దాంతోనే బెదిరింపులకు పాల్పడి అతగాడి నుండి కొన్ని ఆభరణాలు కూడా నొక్కేసిందని వినికిడి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఆమెని వెనుక నుంచి డైరెక్ట్ చేస్తున్న ఒక వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు గుర్తించారు. చక్కని రూపం, మాటకారి అయిన శ్వేత గౌడ తన ఒంపు సొంపులు, ఫేస్‌బుక్ పరిచయాలతో ఎక్కువ మందిని సోషల్ మీడియా వేదికగా వలలో వేసుకుందని కూడా గుర్తించారు. ఇక కష్టపడకుండా డబ్బులు సంపాదించిన అనేకమంది ఆమెకు బలయ్యారని వినికిడి. అంతేకాకుండా, చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితురాలు, నటీమణి పవిత్రాగౌడతో శ్వేతకు స్నేహం ఉందని కూడా పోలీసు విచారణలో గుర్తించారు.