ఒకప్పుడు నేషనల్ టెన్నిస్ ప్లేయర్.. కానీ ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ క్రేజీ హీరోయిన్..!
ఇంతకి ఈ హీరోయిన్ ఎవరు అంటే.. ఇంతకీ ఆమె మరి ఎవరో కాదు క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరి .. ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది బ్యూటీ. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించింది . కానీ హిట్ 2 సినిమాతో ఈ అమ్మడు లక్ మారిపోయింది. హిట్ 2 సూపర్ హిట్ అవడంతో మీనాక్షికి టాలీవుడ్ లో వరుస ఆఫర్లు క్యూ కేటాయి. ఆ వెంటనే మహేష్ బాబుకు జంటగా గుంటూరు కారం సినిమాలో నటించింది మీనాక్షి.. ఇక తర్వాత లక్కీ భాస్కర్ , మట్కా సినిమాల్లో కూడా నటించింది.
ప్రెసెంట్ విక్టరీ వెంకటేష్ కు జంటగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటిస్తుంది .. ఈ సినిమా కూడా వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు రానుంది .. మరికొన్ని తెలుగు సినిమాల్లో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది .. అదే విధంగా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా అదరగొడుతుంది. అయితే ఈ స్టార్ బ్యూటీ 2018 ఫెమినా మిస్ ఇండియా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్ ... అదేవిధంగా మీనాక్షి రాష్ట్ర స్థాయి టెన్నిస్ ప్లేయర్ .. కాలేజీ డేస్ లో ఈమె ఎక్కువగా స్పోర్ట్స్ లో పాల్గొనేదట .. హీరోయిన్ గా కాకపోతే ఈమె టెన్నిస్ ప్లేయర్ గా మారేదేమో ..