టాలీవుడ్ కు తెలంగాణ సర్కార్ కండిషన్స్...అవి ఏంటంటే?

MADDIBOINA AJAY KUMAR
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపద్యంలో నేడు సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. సినీ ప్రముఖులు అల్లు అర్జున్, అల్లు అరవింద్, చిరంజీవి, వెంకటేష్ తదితరులు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగే మీటింగ్ లో మంత్రులు భట్టి, కోమటిరెడ్డి, ఉత్తమ్ భాగం అయ్యారు. ఈ మీటింగ్ లో బెనిఫిట్ షోలు ఉండవని రేవంత్ రెడ్డి తెలిపారు.  అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. సినీ ప్రముఖులతో భేటీలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతిభద్రతల విషయంలో రాజీ లేదని పేర్కొన్నారు. ఇకపై బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామని చెప్పారు. ఇకపై అభిమానుల్ని కంట్రోల్‌ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో సినీరంగం సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని చెప్పారు. డ్రగ్స్‌ కట్టడి, మహిళా భద్రతపై ప్రచారంలో చొరవ చూపాలని స్పష్టం చేశారు. అలాగే ఆధ్యాత్మిక, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలని రేవంత్‌రెడ్డి చెప్పారు.
ఇక పోతే ఐకన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన గురించి అందరికి తెలిసిందే. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. తొక్కిసలాటలో శ్రీ తేజ్ కి ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ జరిగిందని.. ఆసుపత్రి ICU లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆ బాలుడి ఇప్పుడు క్రమంగా కోలుకుంటున్నాడు.
ఇక ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్‌ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనదుకు థియేటర్‌ యాజమాన్యంపై కూడా కేసు నమోదైంది. దీంతో ఈ ఎలాంటి ఘటన మళ్లీ ఎప్పుడు జరగకూడదని ఇలాంటి కండిషన్స్ సర్కార్ పెడుతున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: