
టివి: ఒక్క రోజుకే సీరియల్ నుంచి దండం పెట్టి బయటకు వచ్చేసిన గీతూ రాయల్..!
చాలామంది అభిమానులు నిఖిల్, కావ్య ఎప్పుడు కలిసి మరొక ప్రాజెక్టు చేస్తారని చాలామంది ఎదురు చూశారు కానీ వీరు రియల్ లైఫ్ లో కలిసేలా కనిపించడం లేదు.. అటు చిన్ని సీరియల్ లో కూడా నిఖిల్ తో కలిసి నటిస్తోంది కావ్య. ఈ సీరియల్లో నిఖిల్ మాత్రమే కాకుండా మరో కొన్ని కొత్త క్యారెక్టర్ లను కూడా తీసుకురావడం జరిగింది.. నిఖిల్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తూ ఉండగా అతని అసిస్టెంట్గా జబర్దస్త్ పవిత్ర నటిస్తోంది.. అయితే అలా పట్టుమని పది ఎపిసోడ్లలో నటించకుండానే ఈమెను తప్పించారు.
ఆ సమయంలో మరొక బిగ్ బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్ నీ తీసుకురావడం జరిగింది.. ఇందులో కూడా పోలీస్ ఆఫీసర్ కి అసిస్టెంట్ గానే కుందన పాత్రలో ఈమె నటించింది. అయితే ఇందులో ఈమె గెటప్ చాలా ఘోరంగా కనిపించిందట ముఖ్యంగా అసలు ఈమె పాత్రకే సెట్టు కాలేదని పైగా పోలీస్ ఆఫీసర్గా అంటే దండం సామి అనేటట్టుగా మారిపోయింది. ఈమె హెవీ పర్సనాలిటీకి టైట్ జీన్స్ , షర్ట్ వేసుకుంటే దండం పెట్టేస్తున్నారట ప్రేక్షకులు.. ఈ విషయాల పైన గీత రాయలే తాను ఇంత బాడీలో అంత టైట్ దుస్తులు వేసుకుంటే పందిలాగా కనిపిస్తున్నానంటూ తనమీద బాడీ షేవింగ్ చేసుకుంటున్నారంటూ తెలియజేసిందట దీంతో ఇక సీరియల్ కి దండం బాబోయ్ అంటూ తాను చేయలేనని ఒక్క రోజుకే బయటికి వచ్చేసిందట. అయితే తాను ఒక్క రోజుకి షూటింగ్ కి ఎలా కష్టపడ్డానని విషయం పైన ఒక వీడియో కూడా పెట్టింది.