ఆ టాలీవుడ్ హీరోపై పొగడ్తల వర్షం కురిపించిన కృతి శెట్టి..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటీ మణులలో కృతి శెట్టి ఒకరు. ఈమె ఉప్పెన అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాలోనే తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈమెకు ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఈమె ఉప్పెన సినిమా తర్వాత చాలా తెలుగు సినిమాలలో నటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా ఈమెకు ఇప్పటి వరకు మీరు చాలా మంది హీరోలతో కలిసి నటించారు. అందులో ఏ హీరోతో నటించడం మీకు చాలా కంఫర్ట్ గా అనిపించింది అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు కృతి శెట్టి సమాధానం చెబుతూ ... నేను ఇప్పటి వరకు నా కెరియర్ లో చాలా మంది హీరోలతో కలిసి నటించాను.


అందులో నాగ చైతన్య కూడా ఒకరు. ఇక నాగ చైతన్య తో నటించడం నాకు ఎంతో కంఫర్ట్ గా అనిపిస్తుంది. అలా నాగ చైతన్య తో నటించే సమయం లో కంఫర్ట్ గా అనిపించడానికి ప్రదాన కారణం ఆయన ఎంతో హానెస్ట్ గా ఉంటారు అని కృతి శెట్టి చెప్పుకొచ్చింది. ఇక తాజాగా కృతి శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య , కృతి శెట్టి కాంబోలో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. మొదటగా వీరి కాంబోలో బంగార్రాజు అనే సినిమా వచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ మూవీ లోని వీరిద్దరి జంటకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి. ఆ తర్వాత వీరి కాంబోలో కస్టడీ అనే సినిమా వచ్చింది. మంచి అంచనాలు నడుమ విడుదల అయిన ఈ సినిమా మాత్రం బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో కృతి శెట్టి తెలుగు సినిమాల కంటే కూడా ఇతర భాష సినిమాలో నటించడానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ks

సంబంధిత వార్తలు: