ఆ లిస్టులోకి చేరిపోయిన భాగ్యశ్రీ.. బ్యాడ్ లక్ మామూలుగా లేదుగా..?

Pulgam Srinivas
ఓ బ్యూటీ సినిమాల్లోకి ఎంట్రీ వచ్చాక ఆమె ఎంత బాగా నటించింది అనే దాని కంటే కూడా ఆమె ఎన్ని సినిమాలు నటిస్తే అందులో ఎన్ని మూవీ లు మంచి విజయాలను అందుకున్నాయి అనే దానిపై ఆధారపడి ఎక్కువగా క్రేజీ సినిమాలలో అవకాశాలు వస్తాయి అని చాలా మంది అభిప్రాయ పడుతూ ఉంటారు. ఓ ముద్దుగుమ్మ తన అద్భుతమైన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె నటించిన సినిమాలు పెద్దగా విజయాలను సాధించకపోతే ఆమెకు క్రేజీ సినిమాలలో , భారీ సినిమాలలో అవకాశాలు రావు అని అదే పెద్ద స్థాయిలో నటనను ప్రదర్శించకపోయిన ఓ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు వరుసగా విజయాలు సాధిస్తే ఆమెకు అద్భుతమైన అవకాశాలు దక్కుతాయి అనే అభిప్రాయాలను చాలా మంది వ్యక్త పరుస్తూ ఉంటారు. రవితేజ హీరో గా రూపొందిన మిస్టర్ బచ్చన్ అనే మూవీ తో భాగ్య శ్రీ తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.


ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన ఈ మూవీ తో ఈమెకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది. దానితో ఈమెకు వరుస పెట్టి సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. కానీ ఈమె ఇప్పటి వరకు నటించిన ఏ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోలేదు. కొంత కాలం క్రితం ఈమె నటించిన కింగ్డమ్ సినిమాకు మంచి టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా కూడా యావరేజ్ మూవీ గా మిగిలిపోయింది. తాజాగా ఈమె నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ కి కూడా మంచి టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా కూడా హిట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దానితో చాలా మంది భాగ్య శ్రీ తన అద్భుతమైన నటనతో  , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాను నటించిన చాలా సినిమాలకు మంచి టాక్ కూడా వస్తుంది. కానీ ఆ సినిమాలు విజయాలు సాధించడం లేదు అనే అభిప్రాయాలను చాలా మంది వ్యక్త పరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: