ఎవడే సుబ్రమణ్యం ఫైనల్ కలెక్షన్ ఎంతంటే?

frame ఎవడే సుబ్రమణ్యం ఫైనల్ కలెక్షన్ ఎంతంటే?

MADDIBOINA AJAY KUMAR
ఎవడే సుబ్రమణ్యం సినిమా చూడని వారుండారు. అప్పటినుండి ఇప్పటివరకు ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ.. ఈ సినిమాకు మాత్రం క్రేజ్ తగ్గలేదు.  ఆ టైమ్ లో ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అంటే ఇదిరా అనిపించేలా ఉన్న సినిమా ఇది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోలుగా న్యాచురల్ స్టార్ నాని, రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ లుగా మాళవిక, రీతూ వర్మ నటించారు. ఈ సినిమాకు అందాల రాక్షసి ఫేమ్ రాధన్ సంగీతం అందించాడు.


ఆ రోజుల్లోనే థియేటర్లలో ఈ సినిమా మంచిగా ఆడింది. ఈ మూవీ మంచి టాక్ ని కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని పాత్రలకు నాని, మాళవిక, విజయ్ దేవరకొండ ప్రాణం పొసరనే చెప్పాలి. వీరి నటన మాత్రం చాలా అద్బుతంగా ఉంటుంది. ఈ సినిమాలో నాని సుబ్రమణ్యం పాత్ర పోషించాడు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నాని తనని తాను అన్వేషించుకోవడానికి చేసిన ఓ ప్రయణమే ఈ సినిమా. ఈ సినిమాను ప్రియాంక దత్ నిర్మించారు.

 
అయితే ఈ సూపర్ సినిమా వచ్చి పదేళ్ల అవుతుంది. ఇక ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ని చూద్దాం. ఎవడే సుబ్రమణ్యం సినిమా రూ. 6.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యి.. రూ. 7.82 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా రూ. 1.32 కోట్ల లాభాలతో హిట్ గా నిలిచింది. ఈగ తర్వాత నానికి మంచి క్లీన్ హిట్ అందించిన సినిమా ఇదే. ఈ సినిమాకు ప్రేక్షకులు చాలా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా అందరి హృదయాలలో నిలిచిపోయింది. ఇక నాని నటించిన ఎవడే సుబ్రమణ్యం సినిమాకు మామూలు ఫ్యాన్ బేస్ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: