మళ్ళీ దొరికిపోయిన టాలీవుడ్ లవ్ బర్డ్స్...!

MADDIBOINA AJAY KUMAR
సినీ ఇండస్ట్రీలో నిత్యం లవ్ స్టోరీపై రూమర్స్ హాల్ చల్ అవ్వడం చూస్తూనే ఉంటాం. అయితే ఈ క్రమంలో గత రెండు మూడేళ్లుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సినీ నటి రష్మిక మందన్న ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇద్దరు కలిసి ఒకే చోట ఉన్నట్టుగా నెటిజ‌న్స్ ఇప్ప‌టికే చాలా ఫ్రూప్స్ చూపించారు. ఇక వీరిద్ద‌రి ఎంగేజ్ మెంట్ ఫిబ్రవరిలో జరుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన‌ విషయం తెలిసిందే. అయితే తాజాగా రష్మికతో డేటింగ్ పై రౌడీ హీరో విజయ్ క్లారిటీ ఇచ్చేశాడు.
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ ఈ ప్రచారాలపై స్పందించారు. ఈ విషయంపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తానని తెలిపారు. ఈ ప్రపంచం మొత్తం ఎప్పుడు ఈ విషయం గురించి తెలుసుకోవాలని అనుకుంటుందో అప్పుడు బయటపెడతానని చెప్పుకొచ్చారు. రష్మికతో డేటింగ్ పై క్లారిటీ ఇవ్వాలంటే ఒక సమయం, సందర్భం రావాలని ఇంటెలిజెంట్ గా రిప్లై ఇచ్చారు. తాను ఒక హీరో అవ్వడమంతో తన జీవితంలో జరిగే విషయాల గురించి తెలుసుకోవాలని ప్రేక్షకులు అనుకుంటారని.. ఆ విషయంలో తనపై ఎలాంటి ఒత్తిడి లేదని విజయ్ తెలిపారు. ఇక అంతకు ముందు కూడా ఇలాగే రష్మిక, విజయ్ లవ్‌ లో ఉన్నారని.. ఫిబ్రవరిలోనే వీరు పెళ్లికి సిద్ధమయ్యారని ప్రచారం జరిగింది. ఇక ఈ జంట ఒక్కటి కాబోతుందని, ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారంటూ ప్ర‌చారం సాగుతుండ‌డంతో అప్పుడు కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ ఇంగ్లీష్‌ మేగజీన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. మీడియా తనకు ప్రతి ఏడాది పెళ్లి చేయాలని చూస్తుందని అన్నారు. ప్రతి సారి ఇలాంటి రూమర్స్ వింటూనే ఉన్నానని.. దొరికితే పెళ్లి చేయాలనుకుంటున్నారు అంటూ సెటైరికల్‌గా, ఫన్నీగా విజయ్ దేవ‌ర‌కొండ బ‌దులు ఇచ్చారు.
అయితే ఇదిలా ఉండగా, ఇటీవల విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మళ్లీ దొరికిపోయారు. ఈ టాలీవుడ్ లవ్ బర్డ్స్ ఇద్దరు ఎయిర్ పోర్ట్ లో ఎక్కడికో వెళ్తున్న ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి విజ‌య్ దేవ‌ర‌కొండ , ర‌ష్మిక బంధంపై ఓ క్లార‌టీ అయితే వ‌చ్చింది అంటూ నెటిజన్స్ పోస్టులు, కామెంట్స్ పెడుతున్నారు. దీనికి రౌడీ బాయ్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: