అన్‌స్టాపబుల్ 4 చివరి ఎపిసోడ్ .. ఎవరు ఊహించిన గెస్ట్ .. అభిమానులకు పూనకాలే..!

Amruth kumar
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .
నట‌సింహం నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాత గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్  4 ఎంతో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది .. ఈ టాక్ షోలో ఇప్పటికే ఎందరో స్టార్ హీరోలు సందడి చేయగా .. బాలకృష్ణ కూడా తనదైన మార్క్ ఎంటర్టైన్మెంట్ ను ప్రేక్షకులకు అందిస్తున్నాడు .. ఇప్పుడు ఈ టాక్ షోకు సంబంధించిన 7 ఎపిసోడ్ టీజర్ కూడా రీసెంట్ గా వచ్చేసింది .. అన్ స్టాపబుల్ 4 లేటెస్ట్ ఎపిసోడ్ లో సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గెస్ట్ గా వచ్చారు .

 
అయితే ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 4 లో కేవలం 8 ఎపిసోడ్స్ మాత్రమే రానుందని తెలుస్తుంది .. అలాగే ఈ టాక్స్ షో కు సంబంధించిన లాస్ట్ ఎపిసోడ్ షూటింగ్ కోసం ఆహా టీం రెడీ అవుతున్నారట .. ఈ సీజన్ 4 లాస్ట్ ఎపిసోడ్ కి గెస్ట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి .. గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య షోలో రామ్ చరణ్ పాల్గొనబోయే షూటింగ్ త్వరలో నే జరగబోతున్నట్టు తెలుస్తుంది ..

 
అయితే ఇప్పుడు అన్‌స్టాపబుల్ సీజన్  4 చివరి ఎపిసోడ్ కి రామ్ చరణ్ తో పాటు గేమ్ చేంజర్ మూవీ యూనిట్ కూడా రాబోతుంద ని క్లారిటీ వచ్చింది .. అయితే తెలుగు అభిమానులు మాత్రం ఎంతగానో ఎదురు చూసిన మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ అపీరియన్స్ లేకుండా నే ఈ సీజన్ ముగియడం తో మెగా నందమూరి అభిమానులు కాస్త నిరుత్సాహానికి లోనవుతున్నార ని కూడా చెప్పాలి .. మరి రాబోయే సీజన్ లో అయినా చిరంజీవి , నాగార్జున , ఎన్టీఆర్ వంటి హీరోల గెస్ట్ అపీరియన్స్ ఉంటుందో లేదో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: