2025 ఎంత మంది హీరోలకు అద్భుతంగా కలిసి వచ్చిందో తెలుసా..?

Pulgam Srinivas
వరుస ప్లాప్ లతో కెరియర్ను కొనసాగిస్తున్న కొంత మంది నటులకు ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చింది. ఈ సంవత్సరం మంచి విజయాలను అందుకొని కం బ్యాక్ ఇచ్చిన నటులు ఎవరు అనేది తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా వెంకటేష్ కి సరైన విజయం లేదు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఈయన నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల అయింది. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తో వెంకటేష్ అద్భుతమైన ఫామ్ లోకి వచ్చాడు. 

గత కొంత కాలం గా బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయం లేని నాగ చైతన్య ఈ సంవత్సరం తండెల్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఎంతో కాలంగా వరుస అపజయాలను ఎదుర్కొంటున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సంవత్సరం కిష్కిందపురి సినిమాతో మంచి విజయాన్ని అందుకొని అద్భుతమైన కం బ్యాక్ ఇచ్చాడు. మంచు మనోజ్ వరసగా ఎన్నో ఆపజయాలను ఎదుర్కొన్నాడు. అలాగే ఆయన సినిమాలకు దూరం అయ్యి కూడా చాలా సంవత్సరాలవుతుంది. 

ఈ సంవత్సరం ఆయన విలన్ పాత్రలో నటించడం మిరాయ్ మూవీ మంచి విజయం సాధించింది. ఈ మూవీ లోని విలన్ పాత్ర ద్వారా మంచు మనోజ్ కు మంచి ప్రశంశలు కూడా దక్కాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం ఓజి మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ప్రేమ కావాలి , లవ్ లీ సినిమా లతో మంచి విజయాలను అందుకొని మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆది సాయి కుమార్ ఆ తర్వాత అనేక అబజయాలను సొంతం చేసుకున్నాడు. తాజాగా ఈయన నటించిన శంభాల సినిమా విడుదల అయ్యి అద్భుతమైన టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమాతో ఆది సాయి కుమార్ సూపర్ సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: