ఉపాధి హామీ కూలీలకు కేంద్రం గుడ్ న్యూస్.. కూలి పెంపు ఎంతంటే..?
ప్రస్తుతమైతే ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలు నాలుగు గంటల పాటు పనిచేస్తున్నారు.. ఇప్పుడు వీరికి మరొక గంట పెంచేలా చూడాలని ప్రభుత్వం కూడా సూచిస్తున్నదట. ఉపాధి సిబ్బంది ఏపీ డీఈలు, ఏపీవోలు ,ఎంపీడీవోలు సైతం రోజు కచ్చితంగా మాస్టర్లను తనిఖీ చేయాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు. అలాగే ఉపాధి కూలి హామీ పథకానికి సంబంధించి రూ.300 రూపాయలు లబ్ధి పొందాలి అంటే ఈ మొత్తం పనులు ఎంత సమయంలో చేయాల్సి ఉంటుందనే అంశాల పైన కూడా జిల్లాస్థాయిలో వేతనాలకు సంబంధించి పర్యావేక్షణ విభాగం తెలియజేస్తుంది అంటూ తెలుపుతున్నారు.
ఈమధ్య ఉపాధి హామీ పథకాలలో కూడా బోగస్ మాస్టర్లు ఎక్కువ అవుతూ ఉండడంతో పాటుగా అలా మాస్టర్లు వేసుకొని ఆ వేతనాలను స్వాహా చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇలాంటి పనులు చేయకుండా విజిలెన్స్ అధికారులు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ఉండాలని తెలుపుతున్నారు..
ఇక ఉపాధి కూలీల కనీస వేతనం పెరగడానికి ప్రభుత్వం పలు రకాలు నిబంధనలను పెట్టిందట.. ముందుగా నేల అంచనాలను కూలీలు పనిచేయడానికి సరిపడు అనుగుణంగా ఉండేలా ప్రదేశాలలో తీసుకోవాలని పనివేళలో మార్పులు చేయాలని అలాగే కూలీలు పనిచేసిన తర్వాత కొలతలు పారదర్శకంగానే లెక్కించాలని వేతనాల రసీదు కూడా కచ్చితంగా ఇవ్వాలని తెలిపారు. ఇక మీదట నాలుగు గంటల పనిని 5 గంటల పాటు చేయాల్సి ఉంటుంది అంటూ తెలుపుతున్నారు.