
డీలిమిటేషన్ పై టీడీపీ, వైసీపీ వైఖరి ఏంటో..?
డీలిమిటేషన్ జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. దీనిపై తమిళనాడు సీఎం స్టాలిన్ దక్షిణాదిని మొత్తం ఏకం చేస్తున్నారు. దీనిపై తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఒకటై హాజరైంది. డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతుందని ఆ ప్రాంత ముఖ్యమంత్రులు కీలక నేతలు రాజకీయ పార్టీలు అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకు సిద్ధపడుతున్నారు. ఎంపీ సీట్లు, నిధులు, అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు ఇబ్బందులు పడతాయని అభిప్రాయపడుతున్నాయి.
ఈ విషయంలో ఏపీ వైఖరికి మాత్రం దక్షిణాది రాష్ట్రాల భిన్నంగా ఉంది. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నారు. ఇక ఈ విషయంలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సైతం సైలెంట్ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సైతం తటస్థంగా ఉన్నారు. అయితే ఎంతో అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు చంద్రబాబు డీలిమిటేషన్ గురించి అసలు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. జగన్ సైతం అఖిలపక్షం రోజున ప్రధానికి ఒక లేఖ రాసేసి మమ అనిపించారు అనే వాదనలు ఉన్నాయి.
తమిళనాడులో అన్ని పార్టీలూ డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా గొంతు కలిపాయి. రాజకీయంగా బద్ధ శత్రువులు గా ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలకు చెందిన నాయకులు చెన్నై మీటింగుకు వెళ్ళి వచ్చాయి. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరూ కూడా డీలిమిటేషన్ మీద చాలా సీరియస్ గానే ఉన్నారు. భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి అన్నది ఆలోచిస్తున్నారు.
సీఎం చంద్రబాబు మాజీ సీఎం జగన్ ఇద్దరూ ఇంతటి కీలకమైన ఇష్యూని పట్టించుకోకపోవడం మీద విమర్శలు వస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే ఏపీలో ప్రస్తుతం ఉన్న 25 సీట్లకు ఒకటో రెండో పెరిగితే పెరగవచ్చు. వైసీపీ టీడీపీ రెండూ ప్రాంతీయ పార్టీలు. ఈ పార్టీలకే ఎక్కువ ఇబ్బందులు డీలిమిటేషన్ వల్ల వస్తాయని అంటున్నారు. జాతీయ పార్టీల ప్రాధాన్యత పెరుగుతుందని దాంతో వాటి వైపే జనాలు మొగ్గు చూపితే కనుక ప్రాంతీయ పార్టీల అస్తిత్వమే లేకుండా పోతుంది అని అంటున్నారు.