ఈ సంవత్సరం ఇండియన్ సినిమా పరిశ్రమ నుండి అనేక సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్స్ ను రాబట్టాయి. అలా మొదటి రోజు హైయెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్న టాప్ 10 ఇండియన్ మూవీస్ ఏవో తెలుసుకుందాం.
అల్లు అర్జున్ హీరో గా రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 285.55 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా ఇప్పటివరకు ఈ సంవత్సరం అత్యధిక ఓపెనింగ్ లను రాబట్టిన సినిమాలలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ హీరో గా రూపొందిన కల్కి 2898 AD సినిమా 183.20 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలో నిలవగా , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర మూవీ 157 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలో నిలిచింది. ఈ మూవీ తర్వాత తమిళ నటుడు తలపతి విజయ్ హీరోగా రూపొందిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా 104.75 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానంలో నిలవగా , హిందీ సినిమా అయినటువంటి స్త్రీ 2 మూవీ 83.45 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానంలో నిలిచింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన గుంటూరు కారం సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 79.30 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి ఆరవ స్థానంలో నిలవగా , సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా రూపొందిన వెట్టయన్ సినిమా 68.35 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఏడవ స్థానంలో నిలిచింది. హిందీ సినిమా అయినటువంటి సింగం అగైన్ మూవీ 64.50 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి 8 వ స్థానంలో నిలవగా , కమల్ హాసన్ హీరోగా రూపొందిన ఇండియన్ 2 మూవీ 58.10 కోట్ల కలెక్షన్లతో 9 వ స్థానంలో నిలిచింది. హిందీ సినిమా అయినటువంటి బుల్ బులయ్యా 3 మూవీ 55.25 కోట్ల కలెక్షన్లతో పదవ స్థానంలో నిలిచింది.