ఏపీ: తేలిపోయిన లెక్కలు... నెల్లూరులో కావ్య రెడ్డిదే హవా?

Suma Kallamadi
ఆంధ్రాలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయాలు వేసవి వేడిమిని సైతం మించిపోతున్నాయి. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా కావలి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణా రెడ్డి పేరు బాగా వినబడుతోంది. కావ్య కృష్ణాకి స్థానికంగా ఉన్న పలుకుబడి, మంచితనం కారణంగా జిల్లా వాసులు ఆయన వైపే మొగ్గు చూపుతున్నారని గుసగుసలు వినబడుతున్నాయి. ఆయన కెపాసిటీ గుర్తించే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడ ప్రస్తుత ఇంచార్జీ సుబ్బానాయుడిని తొలగించి కృష్ణారెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించిన సంగతి అందరూ వినే ఉంటారు.
ఇక కావ్య కృష్ణా రెడ్డి విషయానికొస్తే, ఓ సాధారణ కాలేజీ లెక్చరర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన కృష్ణా రెడ్డి మైనింగ్ కింగ్ గా ఎదిగారు. నెల్లూరు జిల్లాలో క్వారీలు, క్రషర్లు, కాంక్రీట్ మిక్సర్లు పెట్టి సొంతంగా ఓ పెద్ద మైనింగ్ సామ్రాజ్యాన్నే నిర్మించుకున్నాడు. అక్కడితో ఆగకుండా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఆయన తనదైన ముద్ర వేసారు. ఈ క్రమంలో అంచెలంచెలుగా వ్యాపారాలను అభివృద్ది చేసుకుంటూ ఓ సాధారణ కామర్స్ అధ్యాపకుడు కాస్త వేలకోట్లకి అధిపతిగా ఎదిగాడు. కాగా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకున్న కావ్య కృష్ణారెడ్డి తరువాతి కాలంలో రాజకీయాల్లో చేరారు.
చాలా రోజులుగా టిడిపిలో కొనసాగుతున్న ఆయన ఆఖరికి అనుకున్నది సాధించారు... టిడిపి అదిష్టానాన్ని ఒప్పించి కావలి ఇంచార్జీగా నియమితులయ్యారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యేగా మారడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు కావ్య కృష్ణారెడ్డి. అయితే సర్వేలన్నీ ఆయనకి అనుకూలంగా మారాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నెల్లూరులో కావ్య కృష్ణారెడ్డి తన అధికపత్యాన్ని చూపించడం ఖాయం అని గణాంకాలు చెబుతున్నాయి. ఇక అపోజిషన్ పార్టీ వైస్సార్సీపీ తరుపున ఇక్కడ ఆర్ ప్రతాప్ కుమార్ పోటీ చేయబోతున్నాడు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంజినీరింగ్‌ పూర్తి చేశాక బెంగళూరులో కాంట్రాక్టర్‌గా తన వ్యాపార జీవితాన్ని ఆరంభించాడు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో కావలి నియోజకవర్గం నుండి ప్రజారాజ్యం అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయి 2011లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అయితే ఈయనకి సర్వేలు ఇపుడు అనుకూలంగా లేకపోవడం బాధాకరం!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: