కవిత అరెస్టు గురించి.. ముందే చెప్పేసిన వేణు స్వామి?

praveen
వేణు స్వామి.. ఈయన గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే అందరికీ తెలిసిన సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతారు ఈయన. ఇక సినీ సెలబ్రిటీల భవితవ్యం ఏంటో చెబుతూ ఇక ఎన్నో రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు అని చెప్పాలి. అయితే మొదట్లో వేణు స్వామి చెప్పే విషయాలను మొదట్లో ఎవరు పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఎప్పుడైతే ఈయన చెప్పినట్లుగా సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుని వేరుపడ్డారో.. అప్పటినుంచి వేణు స్వామిని నమ్మడం మొదలుపెట్టారు అందరూ.

 ఇక ఆ తర్వాత వేణు స్వామి చెప్పిన ఎన్నో విషయాలు ఒక్కొక్కటిగా నిజం అవుతూ వచ్చాయి అని చెప్పాలి. గతంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అవుతారని చెప్పారు వేణు స్వామి. ఇది మొన్నటికి మొన్న నిజంగానే జరిగింది. ఇక ఇటీవలే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇటీవల అరెస్టు చేసి ఆమెను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా కవిత అరెస్టు తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారిపోయింది. ఇక ఈ అరెస్టుపై ఎప్పటిలాగానే బిజెపి, బీఆర్ఎస్ పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి అని చెప్పాలి.

 ఇలాంటి సమయంలోనే కవిత అరెస్టు గురించి వేణు స్వామి ముందే చెప్పేశాడు అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారిపోతుంది అని చెప్పాలి. ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ కేసు నుంచి కవిత బయటపడటం కష్టమని ఆమె తప్పకుండా కారాగారం అనుభవిస్తుంది అంటూ వేణు స్వామి గతంలో చెప్పాడు. ఇక ఆయన చెప్పినట్లుగానే ఇటీవల కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే వేణు స్వామి చెప్పింది మరోసారి నిజమైంది అంటూ ఎంతో మంది నేటిజన్స్..  దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడం మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: