పార్లమెంట్ ఎలక్షన్స్.. ప్రత్యర్ధులుగా మారిన భార్యాభర్తలు?

praveen
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నాయ్. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా రాజకీయం ఎంత వాడి వేడిగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేంద్రంలో అధికారాన్ని దక్కించుకోవాలని అన్ని పార్టీలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఇప్పటికే అధికారంలో ఉన్న బిజెపి తమ అధికారాన్ని మరోసారి నిలబెట్టుకుని.. హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తూ ఉంది  ఈ క్రమంలోనే ఇక ఓటర్ మహాశయులను ఆకట్టుకునేందుకు ఎన్నో అస్త్ర శస్త్రాలను కూడా సిద్ధం చేసుకుంటున్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పటికే అనఫిషియల్ ప్రచారాలను కూడా మొదలుపెట్టాయి అన్ని పార్టీలు.

 ఓటర్ మహాశయులను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఎవరు ఊహించని అభ్యర్థులు కూడా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. సినీ సెలబ్రిటీలు, క్రికెటర్లు ఇలా చాలామంది ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో  పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఏకంగా ఈ ఎన్నికలు భార్యాభర్తలిద్దరినీ కూడా ఏకంగా ప్రత్యర్థులుగా మార్చేశాయి.

 వేరువేరు పార్టీల తరఫున భార్యాభర్తలిద్దరూ ప్రత్యర్థులుగా బరిలోకి దిగబోతున్నారు అని చెప్పాలి. పశ్చిమబెంగాల్ లో ఈ ఘటన జరిగింది. బిష్ణు పూర్ నియోజకవర్గం లో మాజీ భార్యాభర్తలు ప్రత్యర్ధులుగా నిలవడం ఆసక్తికరంగా మారింది. ఇక్కడి నుంచి బిజెపి తరఫున సౌమిత్ర ఖాన్ బరిలో ఉన్నారు. అయితే ఆయన మాజీ భార్య సుజాత మండల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుండి అదే నియోజకవర్గం నుంచి బరులోకి దింపింది. అయితే 2019 ఎన్నికల సమయంలో ఇక తృణమూల్  కాంగ్రెస్ పార్టీ నుంచి బిజెపిలో చేరారు సుమిత్ర ఖాన్. ఇక సమయంలో బీజేపీ నుంచి పోటీ చేశారు. ఈ క్రమంలోనే ఇక అప్పుడు భర్తతో కలిసి ఉన్న సుజాత మండల్ భర్త తరఫున ప్రచారం కూడా చేశారు. అయితే మూడేళ్ల క్రితం సుజాత రుణమూల్ కాంగ్రెస్ లో  చేరడంతో భార్యాభర్తలు ఇద్దరు కూడా విడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: