పవన్ కల్యాణ్ - కేటీఆర్ : వైరల్ అవుతున్న "అన్నదమ్ముల అనుబంధం"

Chakravarthi Kalyan
కరోనా మహమ్మారిని తరిమేసేందుకు.. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. తమ వంతు విరాళాలు అందిస్తున్నారు. ప్రముఖులు, సినీనటులు, పారిశ్రామిక వేత్తలు.. ఇలా ఒకరేమిటి అన్ని వర్గాల వారు ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఇలాంటి కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు ఒక్క ప్రభుత్వాలు పూనుకుంటే సరిపోదు. ఇలాంటి సమయంలోనే ప్రజలంతా ఐక్యంగా ఉన్నామని చాటుకునే అవసరం సందర్భం కూడా.

ఇలా ముందుకు వచ్చిన వారిలో జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ ఒకరు. ఆయన ఏకంగా రెండు కోట్ల రూపాయల సాయం ప్రకటించారు. అందులో ఒక కోటి రూపాయలు కేంద్రానికి కాగా.. మరో కోటి రూపాయలు ఏపీ, తెలంగాణకు చెరి సగం కేటాయించారు. ఈ సందర్బంగా పవన్ కల్యాణ్, తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మధ్య సామాజిక మాధ్యమాల్లో జరిగిన సంభాషణ వైరల్ అవుతోంది.

పవన్ కల్యాణ్ తాను చేస్తున్న సాయం గురించి సామాజిక మాధ్యమాల్లో ప్రకటన చేశారు. దీనికి మంత్రి కేటీఆర్‌ కూడా అదే వేదికగా పవన్‌కు థ్యాంక్స్ చెప్పారు. దీనికి పవన్ బదులిస్తూ.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేసీఆర్‌ నాయకత్వంలో సమర్థంగా మీ విధులు నిర్వహిస్తున్నందుకు థ్యాంక్స్ సర్ అని బదులిచ్చారు. దీనిపై మళ్లీ కేటీఆర్ స్పందిస్తూ... థ్యాంక్స్ అన్నా.. అయినా మీరు నన్ను సర్‌ అని పిలవడం ఎప్పటి నుంచి మొదలుపెట్టారు. నేనెప్పుడూ మీ తమ్ముడినే. అలానే పిలవండి అంటూ బదులిచ్చారు.

ఇలా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆసక్తికరమైన ఈ సంభాషణపై నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. అందరం కలిస్తేనే కరోనాపై పోరాడగలమంటూ సంఘీభావం ప్రకటిస్తున్నారు.

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: