సోషల్ మీడియా లో రెచ్చి పోతున్న పవన్ అభిమానులు... మరీ అసభ్యకరంగా..!

Prathap Kaluva

పవన్ కళ్యాణ్ మీద జగన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. పవన్ మీద కొత్త కార్లను మార్చి నట్లు పెళ్లాలను మారుస్తాడని జగన్ చేసిన వ్యాఖ్యలు గురించి తెలిసిందే. దీనితో రాజకీయ సర్కిల్ లో  భారీ చర్చ జరుగుతుంది. అయితే సహజంగానే పవన్ అభిమానులు కోపం తో రగిలి పోతున్నారు. సోషల్ మీడియా లో జగన్ మీద ఎదురు దాడి కి దిగుతున్నారు. అయితే ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు మామూలే కాబట్టి పెద్ద విషయం కాదు. 


అయితే, పవన్‌ అభిమానులు.. వైఎస్‌ జగన్‌తోపాటు, మొత్తంగా జగన్‌ కుటుంబ సభ్యులందర్నీ సోషల్‌ మీడియా వేదికగా వివాదాల్లోకి లాగేశారు. అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. జగన్‌ సోదరి షర్మిల, జగన్‌ భార్య భారతి.. ఆఖరికి జగన్‌ తల్లి విజయలక్ష్మినీ జుగుప్సాకరమైన పదజాలంతో దూషిస్తూ, అత్యంత జుగుప్సాకరమైన పొటోలతో పవన్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో చెలరేగిపోతున్నారు.


పవన్‌ అభిమానులు సృష్టించే 'వివాదాస్పద' హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌ అయిపోవడం పెద్ద వింతేమీకాదు. ''చూశారా.. మేం ట్రెండింగ్‌ చేసేస్తున్నాం.. మా అభిమాన హీరోని అంటే ఇలాగే తాట తీసేస్తాం..' అంటూ హెచ్చరికలు షరామామూలే అయిపోయాయి. సభ్య సమాజం ఏమాత్రం హర్షించని పరిణామమిది. మొన్న కత్తి మహేష్‌, నిన్న శ్రీరెడ్డి.. ఇప్పుడు జగన్‌ సహా ఆయన కుటుంబం.. పవన్‌ అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: